Share News

కుంటలతో నీటి సామర్థ్యం మెరుగు

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:30 AM

పంట పొలాల్లో ఏర్పాటు చేసుకునే నీటి కుంటల వల్ల బోర్లు నీటి సామర్థ్యం పెరుగుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ప్ర పంచ జల దినోత్సవం సందర్భంగా శనివారం జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గండేపల్లి మండలం కె.గోపాలపురంలో నిర్మించిన పంట నీటి కుంటలను ఆయన ప్రారంభించారు.

కుంటలతో నీటి సామర్థ్యం మెరుగు
కె.గోపాలపురంలో నీటి కుంటను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే నెహ్రూ

  • జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ

  • ఘనంగా ప్రపంచ జల దినోత్సవం

  • పలువురు రైతుల పంట పొలాల్లో నీటి కుంటల ఏర్పాటు

  • నీటి పొదుపుపై పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు

గండేపల్లి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): పంట పొలాల్లో ఏర్పాటు చేసుకునే నీటి కుంటల వల్ల బోర్లు నీటి సామర్థ్యం పెరుగుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ప్ర పంచ జల దినోత్సవం సందర్భంగా శనివారం జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గండేపల్లి మండలం కె.గోపాలపురంలో నిర్మించిన పంట నీటి కుంటలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే కాలంలో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం రాకుం డా చుట్టూ ఉన్న ఏలేరు రిజర్వాయర్‌, సూరంపాలెం, భూపతిపాలెం రిజర్వాయ్‌లతో పాటు పంట పొలాల్లో ఏర్పాటు చేసుకునే ఇటువంటి నీటి కుంటల వల్ల బోర్లు నీటి సా మర్థ్యం కూడా పెరుగుతుందన్నారు. పంట నీటి కుంటలను ఏర్పాటుచేసుకున్న బుదిరెడ్డి నరసయ్యమ్మను అభినందించి మిగతా రైతులు ముం దుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ డీవో నాతి బుజ్జి, టీడీపీ నాయకులు పోతుల మోహనరావు, అడబాల భాస్కరరావు, గీతారామచంద్రవర్మ, బాలసుబ్రహ్మణ్యం, ఏపీవో గంగాభవానీ, ఈసీ రమేష్‌, టీఏలు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 12:30 AM