Share News

ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెంపు

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:30 AM

ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పడితే నీటి ఎద్దడిని నివారించవచ్చని రాష్ట్ర పర్యాటక సాం స్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కం దుల దుర్గేష్‌ అన్నారు.

ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెంపు
తోకాడ సభలో మాట్లాడుతున్న మంత్రి కందుల దుర్గేష్‌ చిత్రంలో కలెక్టర్‌ ప్రశాంతి, ఎమ్మెల్యే బత్తుల

రాజానగరం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పడితే నీటి ఎద్దడిని నివారించవచ్చని రాష్ట్ర పర్యాటక సాం స్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కం దుల దుర్గేష్‌ అన్నారు.ఉపాధి హామీ పఽథకంలో రాజానగరం మండలం తోకాడ గ్రామంలో సేద్యపు నీటి కుంట (ఫామ్‌పాండ్‌) నిర్మాణా నికి శనివారం శంకుస్ధాపన చేసి మాట్లాడారు. ప్రధానంగా వర్షాకాలంలో నీటిని నిల్వ చేసు కుని,సేద్యానికి వినియోగించు కునేందుకు నీటి కుంటలు ఎంతో దోహదపడతాయన్నారు. కలెక్టర్‌ పి.ప్రశాంతి మాట్లాడుతూ నీరు ఎక్కడ సమృద్ధిగా ఉంటుందో అక్కడ అభివృద్ధి సాధ్య మన్నారు. దానికి గోదావరి జిల్లాలే ఉదా హరణ అన్నారు. ఉపాధి పథకంలో ఉచితంగా సేద్యపు కుంటలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పా రు.పంచాయతీ, ఇరిగేషన్‌, రెవెన్యూ స్థలాల్లో కమ్యూనిటీ ఫామ్‌ పాండ్స్‌ ఏర్పాటు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిం చిం దన్నారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఇంకుడు గుంటల కార్యక్రమాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీఎంఏవై పఽథకంలో భాగంగా మధ్యలో నిలి చిపోయిన గృహ నిర్మాణానికి మంజూరైన తొలి నగదు చెక్కును మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారు వేగి రాజేశ్వరికి అందజేశారు. సమావేశంలో జనసేన, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు బత్తుల వెంకటలక్ష్మి, నీరుకొండ వీరన్న చౌదరి, చాగల్నాడు కాలువ చైర్మన్‌ అబ్బిరెడ్డి వెంక టేశ్వరరావు, మండల కన్వీనర్‌ వేగిశెట్టి రాజు, ఎంపీడీవో జేఏ ఝాన్సీ, తహశీల్దార్‌ జి.అనం తలక్ష్మి సత్యవతి దేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 12:30 AM