GOD : గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:06 AM
మండలంలోని పామురా యి, పాపంపేట, కట్టకిందపల్లి, ఆకుతోటపల్లి, పూలకుంట, ఇటుకలపల్లి, చియ్యేడు తదితర గ్రామాల్లో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిం చారు. అనంతరం తీర్థప్రసాదాలు, పానకాలు అందించారు.

అనంతపురం రూరల్, ఏప్రిల్6(ఆంధ్రజ్యోతి): మండలంలోని పామురా యి, పాపంపేట, కట్టకిందపల్లి, ఆకుతోటపల్లి, పూలకుంట, ఇటుకలపల్లి, చియ్యేడు తదితర గ్రామాల్లో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిం చారు. అనంతరం తీర్థప్రసాదాలు, పానకాలు అందించారు. అన్నదానం చేపట్టారు. సాయంత్రం సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.
గార్లదిన్నె: మండలంలోని కల్లూరు ఆగ్రహారం, మర్తాడు, కొట్టాలపల్లి, జంబులదిన్నె, తిమ్మంపేట, సంజీవపురం, పెనకచెర్ల, పెనకచెర్ల డ్యాం, కొప్పలకొండ తదితర గ్రామాల్లో ఆదివారం సీతారాముల కల్యాణం వైభవం గా జరిగింది. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అనంతరం భక్తులకు అన్నదానం, తీర్థప్రసాద వినియోగం చేపట్టారు. అలాగే
రాప్తాడు: మండలంలోని హంపాపురం సమీపంలోని మౌనగిరి క్షేత్రంలో ఆ క్షేత్ర వ్యవస్థాపకులు ఈశ్వరయ్య ఆధ్వర్యంలో 39 అడుగుల ఏకశిలా ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. రాప్తాడు సీఐ శ్రీహర్ష దంపతు లు హాజరయ్యారు. అలాగే మండలంలోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. బండమీదపల్లిలో రాముడి చిత్ర పటాన్ని ఊరేగించారు.
చెన్నేకొత్తపల్లి : మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరామనవమి వేడుక లను ఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా జరిపించారు. ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. న్యామద్దల గ్రామంలో 1996-97 పదో తరగతి గోల్డెన బ్యాచ, గ్రామపెద్దల ఆధ్వర్యంలో సీతారామల రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు. అన్నదానం, తీర్థప్రసాద వినియోగం చేపట్టారు.
శింగనమల: శ్రీరామ నవమి వేడుకలను మండలంలోని పెరవలి, నిదనవాడ, సలకంచెరువు తదితర గ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు. శింగనమలలోని ఆత్మసీతారామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల పటాన్ని ఊరేగించారు. బైక్ ర్వాలీ నిర్వహించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....