Share News

బూత్‌ కమిటీల ఏర్పాటుకు కృషి చేయాలి

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:52 AM

బీజేపీ సఖినేటిపల్లి మండల పార్టీ సమావేశం ఇందుకూరి సుబ్బరాజు ఇంటి వద్ద పార్టీ మండల అధ్యక్షుడు పోతురాజు సురేష్‌ అధ్యక్షతన నిర్వహించారు.

బూత్‌ కమిటీల ఏర్పాటుకు కృషి చేయాలి

అంతర్వేది, మార్చి 18(ఆంధ్రజ్యోతి): బీజేపీ సఖినేటిపల్లి మండల పార్టీ సమావేశం ఇందుకూరి సుబ్బరాజు ఇంటి వద్ద పార్టీ మండల అధ్యక్షుడు పోతురాజు సురేష్‌ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మండల ఇన్‌చార్జి పాలూరి సత్యానందం మాట్లాడారు. పూర్తిస్థాయిలో 60బూత్‌ కమిటీలు నిర్మాణం చేసేవిధంగా మండలంలో కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నరేంద్రమోదీ నేతృత్వంతో అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని మండల కమిటీ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. ఎమ్మెల్సీగా సోము వీర్రాజు నియమితులవ్వడం పట్ల బీజేపీ మండల నాయకులు హర్షం వ్యక్తంచేశారు. పార్టీ కార్యాలయానికి రెండు సెంట్ల భూమిని ఇచ్చిన రాష్ట్ర డ్రైనేజీ సెల్‌ కన్వీనర్‌ చెంపాటి శివరామకృష్ణంరాజును అభినందించారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిమాలే శ్రీనివాసనగేష్‌, కన్వీనర్‌ చెంపాటి శివరామకృష్ణంరాజు, అడబాల రాంబాబు, పట్టాపు సూర్యప్రకాశరావు, బోనం నాయుడు, పోతురాజు నాగరాజు, బళ్ల సత్యనారాయణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 12:52 AM