Share News

డయేరియా ఎందుకొచ్చింది?

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:51 AM

గోపాలపురం మండలాన్ని డయేరియా భయ పెడుతోంది.. అయినా ఎందుకు వచ్చిందనేది నేటికీ అంతుచిక్కలేదు.

డయేరియా ఎందుకొచ్చింది?
రోగులకు ఏర్పాటు చేసిన జంబో జెట్‌ కూలర్లు

గోపాలపురం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : గోపాలపురం మండలాన్ని డయేరియా భయ పెడుతోంది.. అయినా ఎందుకు వచ్చిందనేది నేటికీ అంతుచిక్కలేదు. గత నాలుగు రోజులుగా మండలంలో సుమారు 30 మంది డయేరియా బారినపడ్డారు. ఒక పక్క సీఎం చంద్రబాబు నాయుడు గోపాల పురం మండ లంలో పరిస్థితిపై ఆరాతీశారు. ఇదిలా ఉండగా సోమవారం పి.ప్రశాంతి, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ఆసుపత్రిలో బాధితులతో మాట్లాడి వైద్య శిబిరాలను సందర్శించి సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఇంకో వైపు 10 వైద్య బృందాలు క్షేత్రస్థాయిలో ఇంటింటా సర్వేలు చేస్తూ డయేరియా బాధితుల నుంచి మలము, తాగునీరు నమూనాలను సేకరించి ల్యాబ్‌లకు పంపిస్తున్నారు.ఉచిత క్యాంపులు ద్వారా 16వ తేదీన 13 నీటి నమూనాలు, ఒక మలము సేకరించి డీపీహెచ్‌ఎల్‌ ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు.సోమవారం రెం డు చోట్ల నీటి నమూనాలతో పాటు ము గ్గురు డయేరియా బా ధితుల నుంచి మలం సేకరించి కాకినాడ ల్యాబ్‌కు పంపించారు. మరో చోట నాలుగు నీటి నమూనాలను సేకరించి వైజాగ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కు పంపించినట్టు ఇక్కడి అధికారులుచెబుతున్నారు. నమూనాలను ల్యాబ్‌లకు పంపించి రెండు రోజులు పూర్తవుతున్నా నేటికీ ఫలితం అంద లేదు. ఇదిలా ఉంటే ఈ వ్యాధి నిర్థారణ కోసం వివిధ రకాల నమూనాలను జిల్లా యంత్రాంగం సేకరించింది.

గోపాలపురం ఆసుపత్రిలో ఏడుగురు బాధితులు

గోపాలపురంలో డయేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి. సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితుల సంఖ్య 9కి చేరింది. మంగళ వారం ఉదయం వారిలో ఆరుగురు ఇంటికి వెళ్ళారు. మరో నాలుగు కేసులు నమోదయ్యాయి.దీంతో మంగళవారం డయేరియా బాధితుల సంఖ్య ఏడుకు చేరింది. ఎమ్మెల్యే మద్దిపాటి వెం కట్రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితుల ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుంటున్నారు. సోమవా రం ఎమ్మెల్యే మద్దిపాటి ఆసుపత్రికి వచ్చే సమయానికి డయేరియా బాధి తులు ఉన్న వార్డులో ఉక్కబోత ఉండడంతో ఎమ్మెల్యే ప్రతి వార్డులోనూ జంబో కూలర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆసుపత్రి వార్డుల్లో జంబో కూలర్లు ఏర్పాటు చేశారు.

సత్యసాయి నీటి సరఫరాలో నిర్లక్ష్యం?

మండలంలో గత నాలుగు రోజులుగా డయేరి యా వ్యాప్తితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీల ద్వారా సరఫరా చేసిన రక్షిత మం చినీటిని ఈ ప్రాంత ప్రజలు కేవలం గృహావసరాలకు వినియోగిస్తుంటారు.శ్రీ సత్యసాయి మం చినీటి సరఫరా పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీటినే తాగుతారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసింది.కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడిచినా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఆ పథకం నిర్వహణపై దృష్టిసారించలేదు. సత్యసాయి జలాల సరఫరాలో నాణ్యతా లోపం వల్లనే డయేరియా ప్రబలందని ప్రజలంటున్నారు.

Updated Date - Mar 19 , 2025 | 12:51 AM