ఎంటీయూ 1426 రకంతో అధిక దిగుబడి
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:55 AM
వరిలో ఎంటీయూ 1426 రకంతో అధిక దిగుబడులు సాధించవచ్చునని వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నారు.

అయినవిల్లి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): వరిలో ఎంటీయూ 1426 రకంతో అధిక దిగుబడులు సాధించవచ్చునని వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నారు. మంగళవారం మడుపల్లి గ్రామంలో రైతు నాగప్రసాద్ సాగుచేస్తున్న ఎంటీయూ 1426 రకం వరి పంటను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, మార్టేరు పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్ గిరిజారాణి (ప్రధాన శాస్రవేత్త వరి పంట), డాక్టర్ సుధారాణి (ప్రధాన శాస్త్రవేత్త), డాక్టర్ భువనేశ్వరి, ఏరువాక కేంద్రం అమలాపురం కోఆర్డినేటర్ డాక్టర్ నందకిశోర్, జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ డాక్టర్ రాజశేఖర్, మండల వ్యవసాయాధికారి వై.శోభ పరిశీలించారు. ఈ పంట 125-130 రోజులకు కోతకు వస్తుందన్నారు. ఎకరాకు 40 నుంచి 50 బస్తాలు దిగుబడి వస్తుందని, చీడపీడలు అంతగా సోకలేదని, భవిష్యత్తులో ఈ రకాన్ని సన్నరకంగా ప్రాచుర్యం పొందగలదన్నారు.