నూతనోత్సాహం
ABN , Publish Date - Mar 31 , 2025 | 01:02 AM
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొవ్వూరులోని మెయిన్‌రోడ్‌లో జూనియర్ కాలేజ్ వద్ద, గోదావరి గట్టుపై భక్తాంజనేయ స్నానఘట్టం వద్ద గ్రామదేవత కొవ్వూరమ్మ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరగనృత్యాలు ఏర్పాటుచేశారు. రెల్లిపేటలో కనకదుర్గ, నూకాలమ్మ, మెయిన్‌రోడ్‌లో పుంతలో ముసలమ్మ, గోష్పాధక్షేత్రంలోని బాలాత్రిపుర సుందరి, సంస్కృత పాఠశాల లలితాపార్వతీ అమ్మవారి అలయాలను అలంకరించి విశేష అర్చనలు, పూజలు చేశారు.

భక్తిశ్రద్ధలతో ఉగాది వేడుకలు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
షడ్రుచుల పచ్చడి పంపిణీ
దేవాలయాల్లో పంచాంగ శ్రవణం
కొవ్వూరు, మార్చి 30(ఆంధ్రజ్యోతి): శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొవ్వూరులోని మెయిన్‌రోడ్‌లో జూనియర్ కాలేజ్ వద్ద, గోదావరి గట్టుపై భక్తాంజనేయ స్నానఘట్టం వద్ద గ్రామదేవత కొవ్వూరమ్మ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరగనృత్యాలు ఏర్పాటుచేశారు. రెల్లిపేటలో కనకదుర్గ, నూకాలమ్మ, మెయిన్‌రోడ్‌లో పుంతలో ముసలమ్మ, గోష్పాధక్షేత్రంలోని బాలాత్రిపుర సుందరి, సంస్కృత పాఠశాల లలితాపార్వతీ అమ్మవారి అలయాలను అలంకరించి విశేష అర్చనలు, పూజలు చేశారు. వేకువజాము నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని బారులు తీరి అమ్మవారికి నేవేద్యాలు, మొ క్కులు సమర్పించారు. స్థానిక ఫ్యాక్టరీ రోడ్‌లోని నూకాలమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెం కటేశ్వరరావు, ద్విసభ్య కమిటీ సభ్యులు కంట మణి రామకృష్ణారావు, సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికి ఉగా ది శుభాకాంక్షలు తెలియజేశారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది ప్రతిఒక్కరి జీవితంలో శుభాలను, ఆనందాన్ని కలగజేయాలన్నారు. అలాగే మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బావన రత్నకుమారి, కమిషనర్ టి.నాగేంద్రకుమార్, కౌన్సిలర్ కంటమణి రమేష్‌బాబులు పూజలు చేశారు. కుమారదేవం గ్రామంలో గండిపోశమ్మ ఆలయం వద్ద ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరీ, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పండితులు వేద ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి చిత్రపటాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, వట్టికూటి వెంకటేశ్వరరావు, గండ్రోతు పవన్ పాల్గొన్నారు.