Share News

గడువు లేదిక

ABN , Publish Date - Mar 28 , 2025 | 01:51 AM

మార్చి నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉంది. అంటే మరో మూడు రోజులే. రేషన్‌కార్డులకు ఈకేవైపీ తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఏ పథకానికి అయినా అర్హతగా రేషన్‌కార్డునే తీసుకుంటారు. దాంతో రేషన్‌కార్డు విషయంలో అప్రమత్తత ఉండాలి. ఇప్పుడు రేషన్‌కార్డులకు ఈకేవైసీ చేయించుకోవడానికి గడువు దగ్గరకు వచ్చేసింది. ఈకేవైసీ లేకపోతే పథకాలు పొందే అర్హతనూ కోల్పోతారు.

గడువు లేదిక

  • రేషన్‌కార్డులకు ఈకేవైసీ

  • జిల్లాలో 1.43 లక్షల లబ్ధిదారులు ఈకేవైసీ పెండింగ్‌

  • ఈకేవైసీ లేకుంటే పథకాలు కట్‌ అయ్యే అవకాశం

  • ఈనెల 31వ తేదీ వరకే గడువు

  • గడువు పెంచాలని కోరుతున్న లబ్ధిదారులు

మార్చి నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉంది. అంటే మరో మూడు రోజులే. రేషన్‌కార్డులకు ఈకేవైపీ తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఏ పథకానికి అయినా అర్హతగా రేషన్‌కార్డునే తీసుకుంటారు. దాంతో రేషన్‌కార్డు విషయంలో అప్రమత్తత ఉండాలి. ఇప్పుడు రేషన్‌కార్డులకు ఈకేవైసీ చేయించుకోవడానికి గడువు దగ్గరకు వచ్చేసింది. ఈకేవైసీ లేకపోతే పథకాలు పొందే అర్హతనూ కోల్పోతారు. అలాగే ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పొందాలంటే ఈనెలాఖరులోగా మొదటి విడత సిలిండర్‌ బుక్‌ చేసుకోవాలి. లేదంటే ఒక సిలిండర్‌ పొందే అవకాశం కోల్పోతారు.

అంబాజీపేట, మార్చి 27(ఆంధ్రజ్యోతి): కొత్త రేషన్‌కార్డులు జారీచేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉండగా.. అదే తరుణంలో బోగస్‌ కార్డుల ఏరివేతకూ కసరత్తు చే స్తోంది. పఽథకాలకు రేషన్‌కార్డులు ప్రామాణికం కావడంతో కొనసాగింపు, కొత్తవి జారీ చేయడంపైనా ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇదే సమయంలో రేషన్‌కార్డుదారులు ఈనెల 31వ తేదీలోపు ఈకెవైసీ ప్రక్రి య పూర్తిచేయాలని జిల్లా యంత్రాంగం ఇప్పటికే తహశీల్దార్లను ఆదేశించింది. తహశీల్దార్లు గ్రామ రెవెన్యూ, రేషన్‌ డీలర్లతో ప్రత్యే క సమావేశాలు ఏర్పాటుచేసి ఈకేవైసీలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా 15,25,708 మంది లబ్ధిదారులు ఉండగా గురువారం నాటికి 13,82,339 మం ది ఈకేవైసీ పూర్తికాగా 1,43,369 మంది ఈకే వైసీని పూర్తిచేసుకోవాల్సి ఉంది. ఇందులో రా మచంద్రపురం డివిజన్‌కు సంబంధించి 3,85, 445 మంది లబ్ధిదారులు ఉండగా 3,53,553 పూర్తికాగా 31892 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. అమలాపురం డివిజన్‌కు సం బంధించి 6,81,287 లబ్ధిదారులు ఉండగా 6, 15,411 మందికి పూర్తికాగా 68,876 మందికి ఈకేవైసీ పూర్తిచేయాల్సి ఉంది. అలాగే కొత్తపేట సబ్‌ డివిజన్‌కు సంబంధించి 4,58,876 మందికి 4,16,375 మంది పూర్తి కాగా 42,601 మందికి ఈకేవైసీ పూర్తిచేయాల్సి ఉంది. దీం తో ప్రభుత్వం వారి నుంచి వేలిముద్రలను, కంటి ఐరీస్‌ ద్వారా ఈకేవైసీని పూర్తిచేయాల ని ఆదేశించింది. కార్డులోని ప్రతి సభ్యుడు సమీపంలోని రేషన్‌ డీలర్‌, వీఆర్వో, సచివాలయ సిబ్బంది లాగిన్లలో ఆధార్‌కార్డు చూ పించి వేలిముద్రలు లేదా ఐరిస్‌ ఇవ్వాల్సి ఉం ది. లేదంటే మార్చి 31 తరువాత వారి పేర్ల ను కార్డు నుంచి తొలగిస్తారని అధికారులు ఇప్పటికే సూచిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయల్లో మొబైల్‌ యాప్‌, రేషన్‌ల్లోని ఈ పోస్‌ పరికరాల ద్వారా ఆప్‌డేట్‌ చేసుకోనేలా అధికారులు సౌకర్యం కల్పించారు. ఐదేళ్లలోపు పిల్లలకు ఈకేవైసీ నుంచి మినహాయింపుని చ్చారు. ఇప్పటికే ఈకేవైసీ ప్రక్రియ జిల్లాల్లోని ప్రతి గ్రామంలో జోరుగా జరుగుతుంది. రేషన్‌కార్డులోని లబ్ధిదారులందరికి వెలిముద్రలు నమోదు చేయడంతో దాదాపు కార్డులు ప్రక్షాళన జరిగి వాస్తవ లబ్ధిదారులకు మాత్రమే రే షన్‌ పంపిణీ చేసేందుకు అవకాశం కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  • పఽథకాల కోసం పాట్లు....

ప్రభుత్వం అమలు చేయనున్న సూపర్‌ సిక్స్‌ పథకాలు రేషన్‌కార్డు ప్రతిపాదిక కావడంతో పఽథకాల లబ్ధిదారులు ఈ కార్డులను నిలబెట్టుకోవడం కోసం పాట్లు పడుతున్నారు. కొంతమంది లబ్ధిదారులు కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయం లో కార్డులో మార్పులు, చేర్పుల కోసం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు. మే నెల నుంచి ప్రభుత్వం సూపర్‌సిక్స్‌ పఽథకాలను పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా లబ్ధిదారుల ఖరారులో భాగంగా రేషన్‌కార్డులు ప్రామాణికంగా భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు రేషన్‌కార్డుల కొనసాగింపు, పథకాల లబ్ధిదారు ల ఎంపికలో ఈ కార్డులు, ఈకేవైసీ ప్రక్రియ కీలకంగా మారుతోంది. ఇదిలా ఉండగా కొంత మందికి ఆధార్‌ ఆప్‌డేట్‌ లేకపోవడంతో వేలిముద్రలు పడని లబ్ధిదారులు ఆధార్‌ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆయా గ్రామాల్లోని సచివాలయాల్లో ప్రత్యేక ఆఽధార్‌ క్యాంపులు నిర్వహించి ఆధార్‌ ఆప్‌డేట్‌కు అవకాశం కల్పించింది. ఒకపక్క ఈకేవైసీ గడువు సమయం దగ్గరపడడంతో లబ్ధిదారులలో ఆందోళన నెలకొంది. ఈకేవైసీ చేయించుకునేందుకు సచివాలయం, రేషన్‌ డీలర్ల వద్దకు వెళ్లిన లబ్ధిదారులు సర్వర్‌ పనిచేయకపోవడం తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమం లో నిర్ధేశించిన సమయం సరిపోదని, ఈకేవైసీ కి గడువు పెంచాలని పలువురు కోరుతున్నారు.

  • ఉచిత గ్యాస్‌కు ఆఖరి చాన్స్‌

  • జిల్లాలో విజయవంతంగా ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం అమలు

  • తొలి విడత 3.96 లక్షల మంది మహిళలకు రూ.31.38 కోట్ల రాయితీ లబ్ధి

  • ఈ నెలాఖరుతో ముగియనున్న సిలిండర్ల సబ్సిడీ గడువు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ కూటమి ఇచ్చిన మేనిఫెస్టో అమలులో భాగంగా ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ల పథకం అమలు వేగవంతమైంది. లబ్ధిదారులందరికీ ప్రభుత్వం మొదటి విడతగా చెల్లించాల్సిన గ్యాస్‌ సిలిండర్ల సొమ్ములు ఇప్పటికే వారి ఖాతాలకు జమయ్యా యి. దాంతో ముఖ్యంగా మహిళలు చంద్రబాబు ప్రవేశపెట్టిన ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం అమలుతీరు పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలోనే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం ద్వారా సుమారు రూ.31.38 కోట్లను సబ్సిడీ రూపంలో ప్రభుత్వం వారి ఖాతాలకు జమచేసింది. జిల్లాలో వివిధ కంపెనీలకు చెందిన మొత్తం 5.50లక్షల గ్యాస్‌ కనెక్షన్లు మనుగడలో ఉన్నాయి. వాటిలో 3,96,367 గ్యాస్‌కనెక్షన్లు దీపం-2 పథకం కింద అర్హత కలిగి ఉన్నాయి. అయితే వాటిలో 3,92,755 కనెక్షన్లకు సంబంధించిన లబ్ధిదారులు ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని ఇప్పటివరకు సద్వినియోగం చేసుకున్నారు. వాస్తవానికి జిల్లాలో మొత్తం రూ.31.47 కోట్లను సబ్సిడీ రూపంలో ప్రభుత్వం విడుదల చేసింది. ఇక మొదటి విడత గడువు మార్చి నెలాఖరు నాటికి ముగియనున్న నేపథ్యంలో మిగిలిన 5వేల పైచిలుకు లబ్ధిదారులు ఈ పథకాన్ని వినియోగించుకోవాల్సి ఉంది. కాగా జిల్లాలో వివిధ ఆయిల్‌ కంపెనీల ద్వారా మంజూరైన కనెక్షన్లు పొందిన లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ద్వారా 44,866 మంది లబ్ధిదారులకుగాను ఇప్పటివరకు 44,536 మంది దీపం పథకం కింద బుక్‌ చేసుకోగా వీరికోసం ప్రభుత్వం రూ.3,54,61,516 సబ్సిడీని విడుదల చేసింది. వారిలో 44,399 మందికి ఇప్పటివరకు రూ.3,53,53,050 సబ్సిడీని చెల్లించారు. ఇక హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ద్వారా 2,69,361 కనెక్షన్‌లకు 2,65,855 మంది బుక్‌ చేసుకోగా వీరికి 21,55,06,992 రాయితీని ప్రభుత్వం విడుదల చేసింది. వారిలో 2,65,038 మందికి రూ.21,48,39,175 సబ్సిడీని చెల్లించా రు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ద్వారా 82,140 కనెక్షన్లకుగాను 81,532 మంది బుక్‌ చేసుకోగా వారికి రూ.6,37,38,661 సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసింది. వారిలో 81,399 కనెక్షన్లకు రూ.6,36,37,461 రాయితీని చెల్లించారు. ఇదిలా ఉండగా దీపం పథకం కింద వివిధ కారణాల వల్ల 832 కనెక్షన్ల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టగా 458 కనెక్షన్ల సమస్యలను పరిష్కరించారు. ఇక 374 కనెక్షన్లకు సంబంధించి సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా తొలి విడత గ్యాస్‌ సిలిండర్‌ పొందడానికి ఈనెలాఖరు వరకు మాత్రమే గడువు ఉంది. ఈలోపే అర్హత కలిగిన మిగిలిన లబ్ధిదారులు గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేస్తే సబ్సిడీ లభిస్తుంది.

Updated Date - Mar 28 , 2025 | 01:51 AM