Share News

అంతరిక్షం.. అద్భుతం!

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:15 AM

అంతరిక్షం గురించి తెలుసుకోవాలని ఎంతో మందికి ఆసక్తి ఉంటుంది. అంతుచిక్కని, అద్భుత మైన విషయాలపై దృష్టిపెట్టి బుర్రకు పదును పెట్టాలని అనుకుంటూ ఉంటారు. అయితే భారతదేశ సంతతికి చందిన సునీతా విలియమ్స్‌ అంతరిక్షానికి వెళ్లి తిరిగి వస్తున్నారని తెలిసి ఎంతోమంది సంబరపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఆమె భూమిమీదకి వచ్చే క్షణాలను ఆస్వాదించడానికి ఉదయానే నిద్రలేచి టీవీలకు అతుక్కుపోయారు. ఆమె విజయమే తమ విజయంగా మురిసిపోయారు.

అంతరిక్షం.. అద్భుతం!

భూమి మీదకు సునీతా విలియమ్స్‌ రాకతో ప్రజల్లో ఆనందం

సర్వత్రా ప్రశంసలు

అంతరిక్షం గురించి తెలుసుకోవాలని ఎంతో మందికి ఆసక్తి ఉంటుంది. అంతుచిక్కని, అద్భుత మైన విషయాలపై దృష్టిపెట్టి బుర్రకు పదును పెట్టాలని అనుకుంటూ ఉంటారు. అయితే భారతదేశ సంతతికి చందిన సునీతా విలియమ్స్‌ అంతరిక్షానికి వెళ్లి తిరిగి వస్తున్నారని తెలిసి ఎంతోమంది సంబరపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఆమె భూమిమీదకి వచ్చే క్షణాలను ఆస్వాదించడానికి ఉదయానే నిద్రలేచి టీవీలకు అతుక్కుపోయారు. ఆమె విజయమే తమ విజయంగా మురిసిపోయారు.

2028లో ఇస్రో ఆధ్వర్యంలో..

భారతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణం

యాళ్ల శివప్రసాద్‌, ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త

అమలాపురం రూరల్‌ మార్చి 19 (ఆంధ్రజ్యోతి): అంతరిక్షంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. భూమికి వంద కిలో మీటర్ల పైవరకు వాతావరణం ఉంటుంది. ఇక ఆ పైన అంతా అంతరిక్షమే. అక్కడ ఆక్సిజన్‌ అనేది ఉండదని ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త యాళ్ల శివప్రసాద్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో మానవాళి జీవించేందుకు ఉపయోగపడేలా అనువైన ప్రాంతాలను గుర్తించడానికి అంతరిక్ష పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ప్రధానంగా మైక్రో గ్రావిటీ మీద అంతరిక్షంలో ప్రయోగాలు చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలపై ఎంతో ఆసక్తి ఉన్నా సునీతా విలియమ్స్‌ 8రోజులు ప్రయోగాలు చేయడానికి వెళ్లి అనుకోని పరిస్థితుల్లో 9నెలల తర్వాత క్షేమంగా భూమికి తిరిగి రావడం విశేషం. ముందుగా వెళ్లిన ఐదుగురు వ్యోమగాములతోపాటు సునీతా విలియమ్స్‌, మరో వ్యక్తి అక్కడే ఉన్నారు. వారికి అవసరమైన ఆహార పదార్థాలను కార్గో స్పేస్‌ ద్వారా పంపిస్తారు. అంతరిక్షంలో ఉన్నవారికి స్పేస్‌ మెడిసన్స్‌ పేరిట ప్రత్యేకంగా మందులు ఉంటాయి. వారు అక్కడే ఉంటూ అంతరిక్షంతోపాటు ఇతర గ్రహాల మీద మనుషులు జీవించేందుకు వీలున్న ప్రాంతాలను గుర్తించడంతోపాటు అక్కడ లభించే ప్రకృతి సంపదలను గుర్తించేందుకు నిరంతరం ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అమెరికా, రష్యా, జపాన్‌, యూరోపియన్‌ దేశాలతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష సంస్థను అంతరిక్షంలో కట్టారన్నారు. అక్కడ నిర్మించిన స్పేస్‌ సెంటర్‌ అమెరికాలోని ఫుట్‌బాల్‌ క్రీడా ప్రాంగణమంత ఉంటుందని వివరించారు. భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఆ దేశాలు ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ను నిర్మించాయన్నారు. స్పేస్‌ స్టేషన్‌ నిరంతరం భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గంటకు 28వేల కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతుందని వివరించారు. ఒకసారి భూమి చుట్టూ స్పేస్‌ స్టేషన్‌ తిరిగి రావడానికి 90 నుంచి 92 నిమిషాల సమయం పడుతుందన్నారు అంత వేగంగా తిరిగితేనే స్పేస్‌ స్టేషన్‌ అంతరిక్షంలో ఉండగలుతుందని లేకపోతే పడిపోతుందన్నారు. అంతరిక్ష సంస్థ తరహాలోనే భారతదేశం ఇస్రో ఆధ్వర్యంలో స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణానికి ఇప్పటికే సన్నాహాలు చేపట్టిందన్నారు. 2028 నాటికి స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం పూర్తి చేసే అవకాశం ఉందని తెలిపారు. స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణంలో భాగంగా డాకింగ్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసుకున్న దేశాల్లో నాల్గో స్థానాన్ని భారతదేశం దక్కించుకుందన్నారు. డాకింగ్‌ టెక్నాలజీలో భాగంగా పీఎస్‌ఎల్వీ-సీ60 రాకెట్‌లో రెండు ఉపగ్రహాలను ఉంచి గతేడాది డిసెంబరు 30న అంతరిక్షంలో వదిలారన్నారు. ఉపగ్రహాల మధ్య దూరం 20 కిలోమీటర్లు ఉంటుందని, అవి ఒకదానికొకటి దగ్గరకు వచ్చి అనుసంధానం చేయడమే డాకింగ్‌ టెక్నాలజీ విశిష్టత అన్నారు. డాకింగ్‌ టెక్నాలజీ ఉంటేనే స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. భారతీయ వ్యోమోగాములు త్వరలోనే అంతరిక్ష ప్రయోగాలకు ఇస్రో ఆధ్వర్యంలో బయలుదేరడం ఖాయమని శివప్రసాద్‌ స్పష్టం చేశారు.

సునీతా విలియమ్స్‌ అందరికీ స్ఫూర్తి : మంత్రి సుభాష్‌

రామచంద్రపురం(ద్రాక్షారామ), మార్చి 19 (ఆంధ్రజ్యోతి): భారత సంతతి వ్యోమోగామి సునీతా విలియమ్స్‌ సురక్షితంగా భూమిపై రావడం సంతోషకరమని, ఆమె నేటి యువతకు స్ఫూర్తి అని మంత్రి వాసంశెట్టి సుభాష్‌ పేర్కొన్నారు. సునీతా విలియమ్స్‌ 59 ఏళ్ల వయస్సులో అంతరిక్ష పరిశోధనకు వెళ్లి సాంకేతిక లోపం కారణంగా 9 నెలలు అక్కడే ఉండాల్సిరావడంతో ఏమాత్రం మానసిక స్థైర్యం కోల్పోకుండా తిరిగి భూమికి క్షేమ ంగా చేరుకోవడం సామాన్య విషయం కాద న్నారు. సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్‌విల్మోర్‌ను భూమిమీదకు తీసుకురావడానికి కృ షి చేసిన అందరూ అభినందనీయులన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 12:15 AM