Share News

వెంటిలేటర్‌ పైనే అంజలి

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:10 AM

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 26(ఆంధ్ర జ్యోతి): తనకు జరిగిన అన్యాయానికి మనస్తాపం చెంది ఇంజక్షన్‌ చేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఎన్‌.అంజలి రాజమహేంద్రవరం కిమ్స్‌ బొల్లినేని ఆసుపత్రిలో ఐసీయూలో వెంటి లెటర్‌పై ఊపిరి తీసుకుంటుంది. కిమ్స్‌ ఆసుపత్రిలో పనిచేసే ఏజీఎం దీపక్‌ మోసం చేయడంతో అంజలి ఈనెల 23న ఆసుపత్రిలోనే మ త్తు ఇంజక్షన్‌ తీసుకుని అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమె డైరీలో రాయడంతో తన ఆవేదన బయటపడింది. దీని

వెంటిలేటర్‌ పైనే అంజలి

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థిని

ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 26(ఆంధ్ర జ్యోతి): తనకు జరిగిన అన్యాయానికి మనస్తాపం చెంది ఇంజక్షన్‌ చేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఎన్‌.అంజలి రాజమహేంద్రవరం కిమ్స్‌ బొల్లినేని ఆసుపత్రిలో ఐసీయూలో వెంటి లెటర్‌పై ఊపిరి తీసుకుంటుంది. కిమ్స్‌ ఆసుపత్రిలో పనిచేసే ఏజీఎం దీపక్‌ మోసం చేయడంతో అంజలి ఈనెల 23న ఆసుపత్రిలోనే మ త్తు ఇంజక్షన్‌ తీసుకుని అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమె డైరీలో రాయడంతో తన ఆవేదన బయటపడింది. దీనిపై విద్యార్థి సంఘాలు, బంధువులు స్పందించి ఆందోళనకు దిగాయి. తండ్రి ఫిర్యాదు మేరకు ప్రకాష్‌నగర్‌ పోలీసులు స్టేషన్‌లో దీపక్‌పై కేసు నమోదు చేశా రు. దీపక్‌ కుటుంబంతో సహ పరారీలో ఉన్నా డు. మరోపక్క ఆసుపత్రి వద్ద పరిస్థితి అను క్షణం ఆందోళనకరంగా ఉంది. అంజలి పరిస్థితి విషమంగా ఉండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 3రోజులుగా అంజలి వెంటిలేటర్‌పై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఎన్నో కలలతో ఉన్నతంగా ఉద్యోగంలో స్థిరపడి కుటుంబంతో ఆనందంగా ఉండాలని ఊహిం చుకుని ఫార్మ్‌డి ఫైనలియర్‌ చదువుతున్న అంజలి జీవితం ఊహించని మలుపుతిరిగింది. తనకు జరిగిన అన్యాయంపై తిరగబడలేని సగటు యువతిగా బాధలను తట్టుకుని, అవమానాలు దిగమింగుకుని చివరికి ఆత్మహత్యాయ త్యానికి పాల్పడింది. బుధవారం అంజలికి వైద్యులు కొన్ని పరీక్షలు నిర్వహించినట్టు, అయితే ఆమె పరిస్థితిలో ఎటువంటి మార్పులు లేవని తెలిసింది. అంజలి కోసం ఆమె తల్లిండ్రులు ఎదురుచూస్తున్నారు. ప్రకాష్‌నగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. దీపక్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆసుపత్రిలో జరిగిన సంఘటనలపై విచారణ జరగుతుంది.

Updated Date - Mar 27 , 2025 | 01:10 AM