చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:09 AM
అన్నవరం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో 2చోరీ కేసుల్లో నిందితుడిని పట్టుకుని 90గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. గతేడాది డిసెంబరులో కత్తిపూడిలోని ఓ ఇంటి తలుపులు పగలుగొట్టి బంగారు ఆభరణా

అన్నవరం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో 2చోరీ కేసుల్లో నిందితుడిని పట్టుకుని 90గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. గతేడాది డిసెంబరులో కత్తిపూడిలోని ఓ ఇంటి తలుపులు పగలుగొట్టి బంగారు ఆభరణాలు దొంగిలించగా, ఈ ఏడాది ఫిబ్రవరి 10న జాతీయ రహదారిపై ఉన్న నమూనాలయం వద్ద బస్సులో ప్రయాణించే మహిళ మెడలో నగలు దొంగిలించిన కేసులో గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన బైసాని సందీప్‌ను కత్తిపూడి బ్రిడ్జి వద్ద బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. చోరీ చేసిన బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.7.20 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌ఐ హరిబాబు తదితరులున్నారు.