నత్తనడకన విస్తరణ పనులు
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:07 AM
ముద్దనూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

తొమ్మిది నెలలుగా ముందుకు సాగని వైనం గడువులోగా పూర్తిచేస్తారో లేదోనంటున్న జనం
ముద్దనూరు మార్చి24(ఆంధ్రజ్యోతి):ముద్దనూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు చేద్దామా? వద్దా? అన్న ట్లు కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.వివరాల్లోకి వెళితే...ముద్దనూరు పట్టణంలో జాతీయ రహదారుల శాఖా వారు రోడ్డు విస్తర్ణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ,మంచినీటి పైపు లైను, విద్యుత్ స్తంబాలు ఏర్పాటు చేసి తర్వాత రోడ్డు పనులు పూర్తి చేయాల్సి ఉంది. రూ.8కోట్లతో టెండర్లు పూర్తియినా కాంట్రాక్టర్ పనులు ఆలస్యంగా మొదలు పెట్టి 9నెలల గడువు కాలంలో ఇప్పటికే దాదాపు 5నెలలు పూర్తయింది. మిగిలిన 4నెలల సమయంలో .దాదాపు 2కిలో మీటర్లు రోడ్డుకు ఇరువైపుల డ్రైనేజీ, మంచినీటి పైపు లైను, విద్యుత్ స్తంబాలు ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఒక్క ఎక్స్‌కవేటర్‌తోపాటు రెండు ట్రాక్టర్లతో పనులు చేస్తున్నారు. ఇలా పనులు చేస్తే నాలుగు నెలలు కాదు కదా ఏడాదైనా ఇలాగే ఉంటుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా ఇక్కడ పనులు నత్తనడక జరిగితే ఈ ప్రాంత ప్రజలు ఎక్కువ నెలలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటున్నారు. ఇప్పటికే రోడ్డు కొలతల్లో అవకతవకలు జరిగాయని కొందరు అఽదికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుని రోడ్డు పనులు సత్వరం పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.
సకాలంలో పనులు పూర్తి చేస్తాం
పనులు ఆలస్యంగా మొదలు పెట్టడం వాస్తవమే.పనులు పూర్తి చేసేందుకు నాలుగు నెలలు గడువు ఉండడంతో విస్తరణ పనులు నిలిపే ప్రసక్తి ఉండదు. భారీ యంత్రాలను ఉపయోగించి ప్రజలకు ఎటువంటి సమస్య రాకుండా పనులు సకాలంలో పూర్తి చేస్తాం.
-విశ్వనాథ్, జాతీయ రహదారి ఏఈ