Sehwag joke on MS Dhoni: ధోనీని అంత మాట అన్నాడేంటి.. 9వ స్థానంలో బ్యాటింగ్‌పై సెహ్వాగ్ జోక్
ABN , Publish Date - Mar 29 , 2025 | 05:16 PM
చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చెన్నైలోని చెపాక్ మైదానంలో బెంగళూరు ఓడించడం అనేది ఓ పెద్ద రికార్డు. ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభమైన 2008లో మాత్రమే చెపాక్ స్టేడియంలో చెన్నైను బెంగళూరు ఓడించింది. మళ్లీ 17 ఏళ్ల తర్వాత తాజాగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నైను ఓడించగలిగింది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చెన్నైలోని చెపాక్ మైదానంలో బెంగళూరు ఓడించడం అనేది ఓ పెద్ద రికార్డు (RCB vs CSK). ఎందుకంటే ఐపీఎల్ (IPL 2025) ప్రారంభమైన 2008లో మాత్రమే చెపాక్ స్టేడియంలో చెన్నైను బెంగళూరు ఓడించింది. మళ్లీ 17 ఏళ్ల తర్వాత తాజాగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నైను ఓడించగలిగింది. దీంతో బెంగళూరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోనిపై విమర్శలు వస్తున్నాయి (MS Dhoni).
బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కలిగిన ధోనీ.. అశ్విన్ తర్వాత 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగడాన్ని ఎవ్వరూ హర్షించడం లేదు. 9వ స్థానంలో ధోనీ బ్యాటింగ్‌కు రావడాన్ని చెన్నై అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చెన్నై బ్యాటింగ్ ఆర్డర్‌పై జరిగిన ఓ డిబేట్‌లో పాల్గొన్న మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఓ జోక్ వేశాడు. ఎప్పుడూ చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చే ధోనీ ఈ సారి ఎక్కువ ఓవర్లు ఉండగానే బ్యాటింగ్‌కు దిగాడు. 9వ నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగడంపై స్పందిస్తూ.. ఈ సారి కాస్త ముందుగానే వచ్చాడుగా అంటూ చురకలు వేశాడు.
నిజానికి ధోనీ పూర్తి ఫిట్‌గా లేడు. గతేడాది మోకాలికి సర్జరీ చేయించుకున్న ధోనీ పరుగులు తీసేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అయితే కేవలం చెన్నై అభిమానుల కోసమే ధోనీ ఐపీఎల్ ఆడుతున్నాడు. కీపింగ్ చేయగలుగుతున్నాడు కానీ, బ్యాటింగ్ చేసి రన్స్ తీసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు దిగి బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు.
ఇవి కూడా చదవండి..
Virat Kohli: ధోనీ ముందే సీఎస్కే బౌలర్‌కు వార్నింగ్.. విరాట్ కోహ్లీ ఎలా సీరియస్ అయ్యాడో చూడండి..
మ్యాచ్ పోయినా రికార్డు మిగిలింది
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..