Flight Experience : వ్యవసాయ కూలీలకు విమాన యోగం
ABN , Publish Date - Feb 20 , 2025 | 05:46 AM
. వ్యవసాయ కూలీలకు విపరీతమైన కొరత ఉన్నా.. అతడి పొలంలో మాత్రం పది మంది మహిళలు క్రమం తప్పకుండా పనిచేస్తున్నారు.

గోవా ట్రిప్ కానుకగా ఇచ్చిన రైతు
ABN AndhraJyothy : గాల్లో విమానం ఎగురుతుంటే పిల్లలే కాదు.. పెద్దలు కూడా ఇంటి బయటకు వచ్చి వింతగా, ఆశ్చర్యంగా చూస్తారు. ఓ రైతు పొలంలో పనిచేసే మహిళా కూలీలు కూడా అదే చేశారు. వ్యవసాయ కూలీలకు విపరీతమైన కొరత ఉన్నా.. అతడి పొలంలో మాత్రం పది మంది మహిళలు క్రమం తప్పకుండా పనిచేస్తున్నారు. అందుకు కృతజ్ఞతగా వారికేదైనా చేయాలని ఆ రైతు భావించాడు. ఆకాశంలో విమానం ఎగురుతున్న ప్రతిసారీ ఆ కూలీలు పని మానేసి ఆకాశం వైపు చూస్తుండటాన్ని గమనించిన విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా శిరగనహళ్లి గ్రామ రైతు విశ్వనాథ్‌కు తన కూలీలను కూడా విమానం ఎక్కించాలనే ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా.. పది మంది కూలీలనూ ప్రత్యేక డ్రెస్ కోడ్‌తో మంగళవారం గోవా తీసుకెళ్లారు. శివమొగ్గ విమానాశ్రయం నుంచి ఆయన కూడా వారితో కలిసి వెళ్లారు. ఈవిధంగా వ్యవసాయ కూలీలకు జీవితాంతం గుర్తుండిపోయే కానుక ఇచ్చారు.
- బళ్లారి గాంధీనగర్, ఆంధ్రజ్యోతి