MLA Parthasarathi: జగన్ ప్రభుత్వం వాటిపై చీకటి జీఓలు తెచ్చింది.. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి సంచలన ఆరోపణలు
ABN, Publish Date - Jan 02 , 2025 | 05:25 PM
MLA Parthasarathi: నదుల అనుసంధానంపై బీజేపీ ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఏపీవ్యాప్తంగా సస్యశ్యామలంగా మారుతుందని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు.
విజయవాడ: వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థను అధ్వానంగా మార్చారని బీజేపీ ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఇరిగేషన్ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారని చెప్పారు. నదుల అనుసంధానం దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆలోచన విధానమని అన్నారు. వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా నదుల అనుసంధానం చేయడం గేమ్ ఛేంజర్‌గానే పరిగణించాలని చెప్పారు. 80 లక్షల జనాభాకు తాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు, 22.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ, పరిశ్రమలకు 20 టీఎంసీల జలాలు అందించడం లక్ష్యంగా జలహారతిలో కార్యక్రమం రూపొందించామని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.
గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించడం ద్వారా నదుల అనుసంధానం వేగవంతం చేయడం ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యమని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కారణంగా ఏపీవ్యాప్తంగా సస్యశ్యామలంగా మారుతుందని తెలిపారు. జనవరి5 న దేవాలయాల పరిరక్షణ కోసం దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగానే ఇక్కడ హైందవ శఖారావం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతోందని ఎమ్మెల్యే పార్థసారథి వెల్లడించారు.
మఠాధిపతులు, పీఠాధిపతులతో పాటు, రెండులక్షల మంది ఈ కార్యక్రమానికి తరలి రానున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో హుండీ ఆదాయాలను పక్కదోవ పట్టించారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ చీకటి జీఓలతో ఆలయాల ఆదాయాలను వేరే విధంగా వినియోగించిందని ఆరోపించారు. ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌కు దేవుడి మీద భక్తి ఉందో లేదో కానీ హుండీ మీద మాత్రం ఉందని విమర్శించారు. హుండీ డబ్బులు దేవుడికి కాకుండా సంక్షేమ పథకాలకు ఖర్చుపెడతున్నారని చెప్పారు. చాలా దేవాలయాలు ధూపదీప నైవేద్యాలు అందక విలవిలలాడుతున్నాయని అన్నారు. రాజకీయాలకు అతీతంగా దేవాలయాలకే ఖర్చు చేయాలని విశ్వహిందూ పరిషత్ ఆలోచన అని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. కారణమిదే..
AP News: ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు..
AP Politics: టీడీపీ వర్సెస్ వైసీపీగా మండల సర్వసభ్య సమావేశం.. మాటల యుద్ధానికి దిగిన ఇరువర్గాలు..
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ మీటింగ్... కీలక అంశాలకు ఆమోద ముద్ర
Read Latest AP News and Telugu News
Updated Date - Jan 02 , 2025 | 05:31 PM