Share News

Dr. Sudhakar case: డాక్టర్‌ సుధాకర్‌ తల్లికి మంత్రి అనిత ఓదార్పు

ABN , Publish Date - Mar 29 , 2025 | 05:01 AM

కరోనా సమయంలో మాస్కులు అడిగినందుకు వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేసి, చివరకు ప్రాణాలు కోల్పోయిన నర్సీపట్నం ఆస్పత్రి మత్తు వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు. ఆయన తల్లి కావేరీబాయి విజ్ఞప్తిపై విశాఖలోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన మంత్రి, కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయించాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

Dr. Sudhakar case: డాక్టర్‌ సుధాకర్‌ తల్లికి మంత్రి అనిత ఓదార్పు

న్యాయం జరిగేలా చూస్తామని హామీ

విశాఖపట్నం, మార్చి 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ వేధింపులకు ప్రాణాలు కోల్పోయిన నర్సీపట్నం ఆస్పత్రి మత్తు వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు. కరోనా సమయంలో మాస్కులు అడిగినందుకు డాక్టర్‌ సుధాకర్‌పై కేసులు పెట్టారు. నడిరోడ్డుపై లాఠీలతో కొట్టి, మానసిక వైద్యశాలలో చేర్చి తీవ్రంగా వేధించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయన చనిపోయారు. ఆ కేసుల విచారణ ఇంకా పూర్తికాలేదు. ప్రస్తుతం డాక్టర్‌ సుధాకర్‌ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆయన తల్లి కావేరీబాయి ఇటీవల మంత్రి అనితకు ఫోన్‌ చేసి ‘ఓసారి కలుస్తాం. న్యాయం చేయాలి’ అని కోరారు. తానే స్వయంగా ఇంటికి వచ్చి కలుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆ మేరకు శుక్రవారం విశాఖపట్నం సీతమ్మధారలో ఉంటున్న కావేరీబాయి ఇంటికి వెళ్లి పరామర్శించారు. డాక్టర్‌ మరణం తరువాత జరిగిన విషయాలు అడిగి తెలుసుకున్నారు. తమ కేసును సీబీఐతో విచారణ చేయించాలని హైకోర్టు ఆదేశించిందని, అయితే అది ఇంకా పూర్తికాలేదని కావేరీబాయి తెలిపారు. అన్ని విషయాలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.


Also Read:

42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..

మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు

కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 29 , 2025 | 05:01 AM