IPS officer corruption case: ఏసీబీ కేసును కొట్టివేయండి
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:59 AM
స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి కోట్లు వసూలు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారి పి. జాషువా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై అవినీతి ఆరోపణలు లేవని, రాజకీయ కుట్రలో తనను లాగారని తెలిపారు. ఈ కేసులో మాజీ మంత్రి విడదల రజని మరిది విడదల గోపీనాథ్, ఆమె వ్యక్తిగత సహాయకుడు రామకృష్ణ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టును ఆశ్రయించిన జాషువా
ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసిన మాజీ మంత్రి రజనీ మరిది, పీఏ
అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.కోట్లు వసూలు చేసిన ఆరోపణతో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారి పి. జాషువా(ఏ2) శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు ఆధారంగా తదుపరి చర్యలు నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ‘‘ఫిర్యాదుదారుడి నుంచి డబ్బు డిమాండ్ చేసినట్టు నాపై ఎలాంటి ఆరోపణలు లేవు. అవినీతి నిరోధక చట్టం కింద నాపై నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావు. రాజకీయ వర్గాల మధ్య ఉన్న వివాదంలోకి నన్ను లాగారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని నాపై కేసును కొట్టివేయండి’’ అని పిటిషన్‌లో అభ్యర్థించారు. లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్ భాగస్వామి నల్లపనేని చలపతిరావు పెట్టిన ముడుపులు, బెదిరింపుల కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి విడదల రజని మరిది విడదల గోపీనాథ్(ఏ3), ఆమె వ్యక్తిగత సహాయకుడు దొండ రామకృష్ణ(ఏ4) హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
Also Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..