విలువల గురించి జగన్ మాట్లాడటం... పాతివ్రత్యం గురించి చింతామణి చెప్పినట్టుంది
ABN , Publish Date - Feb 07 , 2025 | 05:39 AM
వైసీపీ అధ్యక్షుడు జగన్ విశ్వసనీయత, విలువల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. వేంపల్లెలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దుశ్శాసనుడు మహిళా సాధికారిత గురించి, చింతామణి పాతివ్రత్యం గురించి, గాడ్సే అహింస గురించి

ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఎద్దేవా
వేంపల్లె, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు జగన్ విశ్వసనీయత, విలువల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. వేంపల్లెలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దుశ్శాసనుడు మహిళా సాధికారిత గురించి, చింతామణి పాతివ్రత్యం గురించి, గాడ్సే అహింస గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తన తండ్రి మరణానికి రిలయన్స్ అధినేత అంబానీ కారణమని చెప్పి ఆయన ఆస్తుల మీద దాడి చేయించి.. అధికారంలోకి వచ్చాక ఆయన సిఫారసు చేసిన పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు ఇచ్చారు. పోలవరం, సీపీఎస్ రద్దు, నిరుద్యోగులు, మద్యనిషేధం అగ్రిగోల్డ్ బాధితులు, రైతుభరోసా, పెట్రో ధరల విషయాల్లో మాట తప్పారు. తనకు సొంత పేపర్ లేదని, తాను పేదవాడినని పచ్చి అబద్ధం అడారు. విశ్వసనీయత గురించి జగన్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది’ అని తులసిరెడ్డి మండిపడ్డారు.