కార్డుదారులకు ఈ-కేవైసీ తిప్పలు
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:13 AM
ఉమ్మడి కృష్ణాజిల్లాలో కార్దుదారులకు ఈకేవైసీ కష్టాలు మాములుగా లేవు. అధికారులు రేషన్ దుకాణదారులకిస్తున్న జాబితాలో ఎక్కు వ మంది ఐదారేళ్ల పిల్లల పేర్లు, 80 ఏళ్లు దా టిన వృద్ధులి వారి పేర్లు వస్తున్నాయి. వీ

మొగల్రాజపురం, మార్చి 26 (ఆంధ్రజ్యో తి): ఉమ్మడి కృష్ణాజిల్లాలో కార్దుదారులకు ఈకేవైసీ కష్టాలు మాములుగా లేవు. అధికారులు రేషన్ దుకాణదారులకిస్తున్న జాబితాలో ఎక్కు వ మంది ఐదారేళ్ల పిల్లల పేర్లు, 80 ఏళ్లు దా టిన వృద్ధులి వారి పేర్లు వస్తున్నాయి. వీరంద రి వేలిముద్రలు తీసుకుని ఈ కేవైసీ చేయాలని రేషన్ డీలర్లకు భాద్యతలు అప్పగిస్తూ జాబితా లు అందజేశారు. ఆ జాబితాలోని కార్డుదారులు ఎవరెక్కడుంటారో తెలియడం లేదని డీలర్లు వాపోతున్నారు. ఇంకోపక్క ఈ కేవైసీ ఎవరికి చేయించాలో సమాచారం లేక కార్డుదారులు కూడా పెద్దగా దీనిపై స్పందించడం లేదు.
ఉమ్మడి జిల్లాలో
ఎన్టీఆర్ జిల్లాలో 5,90,293 కార్డులుండగా కార్డుల్లో సభ్యుల సంఖ్య 17లక్షల 02 వేల 907 మంది ఉన్నారు. కృష్ణాజిల్లాలో 522622 కార్డు లుండగా మొత్తం సభ్యుల సంఖ్య 14 లక్షల 41 వేల 385 మంది ఉన్నారు. ఎన్టీయార్ జిల్లాలో లక్షా 65వేల 592 మందికి, కృష్ణాజిల్లాలో లక్షా 32వేల 701 మందికి ఈకేవైసి పెండింగ్‌లో ఉ న్నట్లు చూపిస్తోంది. వీరంతా సంబందిత రేష న్ దుకాణాలకు ఆధార్ కార్డులు తీసుకుని వెళ్లి ఈ కేవైసీ చేయించుకోవాలి. కాని వీరికి సమాచారం ఎలా చేరుతుందనేది సమస్య.
మ్యాపింగ్‌తోనే అసలు సమస్య
ఉమ్మడి కృష్ణాజిల్లాలో 3 లక్షల మందికిపైగా ఈ కేవైసీ చేయాలి. వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ తీసుకుని రావడంతో పౌరసరఫరాల కార్యాలయాలకు పనిలేకుండా పోయింది. సచివాలయ వ్యవస్థ వచ్చిన తరువాత కార్డుల ను ఆయా సచివాలయాలకు మ్యాపింగ్ చేశా రు. ఈ మ్యాపింగ్ ఇపుడు తిప్పలు తెచ్చింది. సచివాలయ వ్యవస్త పుట్టిన మొదట్లో మ్యాపిం గ్ చేశారు. తరువాత పట్టించుకోలేదు. 50 శా తానికి పైగా కార్డుదారులు ఆయా సచివాలయాల పరిధి నుంచి మరో సచివాలయ పరిధలోకి లేదంటే మరో మండలానికో, జిల్లాలో వెళ్లిపోయారు. సచివాలయంలోని వివరాల్లో ఇలా వలస వెళ్లిపోయిన వారి వివరాలు లేవు. వీరి కార్డులు మాత్రం సచివాలయ జాబితాలో ఉం టున్నాయి. దీని ప్రకారం ఈ కేవైసీ చేయాల్సిన పేర్ల వివరాలను సచివాలయం వారీగా రేషన్ డీలర్లకు ఇస్తున్నారు. ఆ జాబిలలో చిరునామా లు, ఫోన్ నెంబర్లు లేవు. దీంతో ఎం చేయాలో తెలియక డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. మరోపక్క ఈ కేవైసీ ఈ నెల 31లోగా పూర్తి చే యాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు.
టీడీపీ హయాంలో..
గతంలో టీడీపీ హయాంలో రేషన్ కార్డుదారుల సమాచారమంతా పౌరసరఫరాల కార్యాలయంలో ఉండేది. ప్రతి నెల రేషన్ డీలర్లకు కీ రిజిస్టర్‌లు ఇచ్చేవారు. కార్డుదారుల వివరాల ను, ఫోన్ నెంబర్‌లను, రేషన్ డీలర్‌లు నమో దు చేసుకునేవారు. దీంతో కార్డుదారులు బి య్యానికి రాకపోతే ఫోన్ చేసి పిలిపించుకుని ఇచ్చేవారు. వైసీపీ వచ్చిన తరువాత డోర్ డెలివరీ విధానం రావడంతో కార్డుదారులు రేషన్ డిపోలకు రావడం లేదు. దీంతో కార్డుదారుల సమాచారం అందుబాటులో లేదు. మరి ఈ ఈవైసీ ఎప్పటికి పూర్తవుతుందో అంతుబట్టని స్థితిలో ఉంది.