Share News

ఆర్‌పీఎఫ్‌ మహిళా బెటాలియన్లకు 30 పడకల బ్యారక్‌

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:13 AM

రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) మహిళా బెటాలియన్లకు రూ.1.5కోట్ల వ్యయంతో విజయవాడ రైల్వేకోర్టు సమీపంలో నిర్మించిన బ్యారక్‌ను బుధవారం ప్రారంభించారు.

ఆర్‌పీఎఫ్‌ మహిళా బెటాలియన్లకు 30 పడకల బ్యారక్‌

రైల్వే స్టేషన్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) మహిళా బెటాలియన్లకు రూ.1.5కోట్ల వ్యయంతో విజయవాడ రైల్వేకోర్టు సమీపంలో నిర్మించిన బ్యారక్‌ను బుధవారం ప్రారంభించారు. ఆర్‌పీఎఫ్‌ మహిళా బెటాలియన్లకు చక్కని వాతావరణం లో విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ బ్యారక్‌ను సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఇన్సెపెక్టర్‌ జనరల్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యురిటీ కమిషనర్‌ ప్రారంభించారు. సౌర విద్యుత్‌ సదుపాయం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రూమ్‌, భోజనశాల, వంటగది, తదితర సౌకర్యాలతో ఈ బ్యారక్‌ను ని ర్మించారు. ఇదే సమయంలో రైల్వే ఆడిటోరియంలో ఏపీ స్టేట్‌ ఆర్‌పీఎఫ్‌ మానవ అక్రమ రవాణా నిరోధక గవర్నమెంట్‌ రైల్వే పోలీసు విభాగాలకు అవగాహన నిమిత్తం, మానవ అక్రమ రవాణపై శిక్షణ తరగతిని నిర్వహించా రు. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఐజీ ఆరోమా సింగ్‌ ఠాకూర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసోసియేషన్‌ ఆఫ్‌ వలంటరీ యాక్షన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయవాడ, గుంటూరు, గుంతకల్‌, వాల్తేర్‌ విభాగాలకు చెం టదిన ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది సహా జీఆర్‌పీ సి బ్బంది మొత్తం 125 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోమా సింగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీలో పనిచేస్తు న్న మహిళా సిబ్బందికి సౌకర్యవంతమైన జీవ నం అందించేందుకు కొత్త బ్యారక్‌ ఉపకరిస్తుందన్నారు. ఇదే సమయంలో మానవ అక్రమ రవాణ నిరోధకతపై ఇచ్చిన శిక్షణ తరగతి కూ డా ప్రభావాన్ని చూపుతుందన్నారు. నేరాలను ఎదుర్కొనడంలో మెళకువల కోసం ఇటువంటి వి అవసరమన్నారు. ఏడీఆర్‌ఎం కొండా శ్రీనివాసరావు, వాలేశ్వర బీ తోకల, ఎస్‌.వరుణబా బు, బీ నరేంద్ర వర్మ, టీ సురేష్‌, కే శ్రీధర్‌, జీ మధుసూదనరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 01:13 AM