Share News

చేతి వృత్తులకు కూటమి ప్రోత్సాహం

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:12 AM

చేతి వృత్తులకు కూటమి ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తోం దని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నా రు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన ఆదరణ-3 అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఆనాటి టీ డీపీ హయాంలో ఆదరణ పథకం పేరుతో కుల వృత్తుల వారికి అనేక రకాల పనిముట్లు అందిం చారని, గత ప్రభుత్వం ఈ పథకాన్ని తుంగలోకి తొక్కి ప్రజలకు ఇవ్వాల్సిన పనిముట్లను గోదాములకు పరిమితం చేసి తుప్పు పట్టి పాడైపోయేలా చేసిందన్నారు.

చేతి వృత్తులకు కూటమి ప్రోత్సాహం
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గోరంట్ల

  • ఆదరణ-3 పథకంపై అవగాహన సదస్సులో ఎమ్మెల్యే గోరంట్ల

కడియం, మార్చి 26(ఆంధ్రజ్యోతి): చేతి వృత్తులకు కూటమి ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తోం దని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నా రు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన ఆదరణ-3 అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఆనాటి టీ డీపీ హయాంలో ఆదరణ పథకం పేరుతో కుల వృత్తుల వారికి అనేక రకాల పనిముట్లు అందిం చారని, గత ప్రభుత్వం ఈ పథకాన్ని తుంగలోకి తొక్కి ప్రజలకు ఇవ్వాల్సిన పనిముట్లను గోదాములకు పరిమితం చేసి తుప్పు పట్టి పాడైపోయేలా చేసిందన్నారు. స మావేశానికి విచ్చేసిన నాయకులు ఏఏ వృత్తుల వారికి ఏఏ పరికరాలు అవసరమో గుర్తించి అధికారులకు తెలపాలన్నారు. కార్యక్రమం లో ఎంపీడీవో కె.రమేష్‌, వైస్‌ ఎంపీ పీలు పంతం గణపతి, కలిదిండి విశాలాక్షి, మార్గాని సత్యనారాయణ, ప్రత్తిపాటి రామారావుచౌదరి, చెల్లుబోయిన శ్రీనివాస్‌, సర్పంచ్‌లు మోసిగంటి సత్యవతి, చెక్కపల్లి మురళీకృష్ణ, పాటంశెట్టి రాంజీ తదితరులు పాల్గొన్నారు.

  • ఎమ్మెల్యే గోరంట్లకు సత్కారం

రాజమహేంద్రవరం రూరల్‌, మార్చి 26(ఆం ధ్రజ్యోతి): తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, త్వరలోనే సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్‌ ఇప్పించాలని సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి గోరంట్ల తీసుకెళ్లిన సందర్భంగా రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి ఆధ్వర్యంలో నియోజకవర్గ తూర్పు కాపులు ఎమ్మెల్యే గోరంట్లను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గోరంట్ల మా ట్లాడుతూ కోస్తాంధ్రలోని అన్ని జిల్లాల్లో వృత్తి, వ్యాపార, ఉద్యోగ రీత్యా తూర్పుకాపులు స్థిరపడి ఉన్నారని రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌, రాజానగరం పరిధిలో అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. వీరు రిజర్వేషన్లు కోల్పోవడం వల్ల విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో ఇబ్బందులు పడుతున్నారని, వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

మండలంలోని కాతేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్‌లాబ్‌ను ఎమ్మెల్యే గోరంట్ల బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్ర ప్రదేశ్‌ను డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో గంగిన హనుమంతరావు, యానాపు ఏసు, తదితరులు పాల్గొన్నారు.

  • ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కృషి

ఽధవళేశ్వరం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ము స్లిం మైనార్టీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. స్థానిక రజా మసీదులో ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ ఆరోగ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్‌కిరణ్‌, షేక్‌ మహ్మద్‌, పండూరి అప్పారావు, మచ్చేటి ప్రసాద్‌, పిన్నంటి ఏకబాబు, తలారి మూర్తి, వర్రే రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 01:12 AM