Share News

నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యం: ఎమ్మెల్యే

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:15 AM

రాజోలు నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడమే నా లక్ష్యమని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ అన్నారు

నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యం: ఎమ్మెల్యే

రాజోలు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రాజోలు నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడమే నా లక్ష్యమని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ అన్నారు. శివకోడు, రాజోలు, పొదలాడ, బి.సావరం, కడలిలో జలజీవన్‌ మిషన్‌ నిధులు రూ.2 కోట్ల 71లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ఆరు వాటర్‌ ట్యాంకులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడిమూలలో 33/11కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేశానని తెలిపారు. గుడిమెళ్లంక సబ్‌స్టేషన్‌ త్వరగా మంజూరు చేయాలని అదనంగా శంకరగుప్తంలో కూడా సబ్‌స్టేషన్‌ మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. రాజోలు నియోజకవర్గానికి 250కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయాలని, కాలిపోయిన 50ట్రాన్స్‌ఫార్మర్లను రీప్లేస్‌ చేయాలని అధికారులను కోరామన్నారు.రాజోలులో 33/11సబ్‌స్టేషన్‌లో ఐదు ఎంవీఏ పీటీఆర్‌ను 8ఎంవీఏపీటీఆర్‌గా ఇంప్రూవ్‌ చేయాలని కోరామని తెలిపారు. రూ.1650 కోట్లతో ధవళేశ్వరం గోదావరి నుంచి నేరుగా పైపులైను ద్వారా నీరు సరఫరా చేసి సురక్షిత మంచినీరు అందించే పథకం త్వరలోనే మంజూరు కాబోతుందని, దీని ద్వారా మంచినీటి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. గోదావరి సెంట్రల్‌ డెల్టా ప్రాజెక్టు చైర్మన్‌ గుబ్బల శ్రీనివాస్‌, ఎంపీపీ కేతా శ్రీను, చాగంటి స్వామి, సూరిశెట్టి శ్రీనివాస్‌, గుబ్బల ఫణికుమార్‌, సర్పంచ్‌లు రేవు జ్యోతి, నక్కా రామారావు, కడలి సత్యనారాయణ, కడియం రమాదేవి, చొప్పల గుణనాథ్‌, సీనియర్‌ టీడీపీ నాయకుడు కసుకుర్తి త్రినాథస్వామి, కాండ్రేగుల కుసులుడు, కాండ్రేగుల సత్యనారాయణ, కాండ్రేగుల స్వామి, కృష్ణ, మానుకొండ దుర్గాప్రసాద్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ డీఈఈ వీఎస్‌ రాజన్‌, తహశీల్దార్‌ ప్రసాద్‌, ఈవోపీఆర్డీ రెహ్మాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 01:15 AM