ఘనంగా పాగుంట వెంకన్న కల్యాణం
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:04 PM
జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండ లంలోని వెంకటాపురం గ్రామ సమీపంలోని కొండపై వెలసిన పాగుంట లక్ష్మీ వెంకటేశ్వ రస్వామి ఆలయంలో శనివారం ఉగాది అ మావాస్య సందర్భంగా అర్చకులు, ఆలయ పెద్దలు స్వామి, అమ్మవారి కల్యాణాన్ని ఘ నంగా జరిపించారు.

కేటీదొడ్డి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండ లంలోని వెంకటాపురం గ్రామ సమీపంలోని కొండపై వెలసిన పాగుంట లక్ష్మీ వెంకటేశ్వ రస్వామి ఆలయంలో శనివారం ఉగాది అ మావాస్య సందర్భంగా అర్చకులు, ఆలయ పెద్దలు స్వామి, అమ్మవారి కల్యాణాన్ని ఘ నంగా జరిపించారు. వేకువజామునే స్వా మి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పలుర కాల అభిషేకాలు జరిపించి పట్టు వస్త్రాలు ధరించి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకం గా అలంకరించారు. అనంతరం ఉత్సవ వి గ్రహాలతో భక్తులతో కలిసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, ఆలయ ప్రాంగణంలోకి తీసుకువచ్చి భక్తుల సమక్షంలో స్వామి, అమ్మవారి కల్యాణాన్ని ఘనంగా జరిపించా రు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండ్ల రాజశేఖర్ రెడ్డి స్వామివారిని దర్శిం చుకొని ప్రత్యేక పూజలు జరిపించి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆలయ పెద్దలు భక్తులతో కలి సి రథోత్సవాన్ని నిర్వహించారు. ఉగాది అ మావాస్య కావడంతో వివిధ ప్రాంతాల నుం చి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వా మివారికి దాసంగాలు సమర్పించారు. భక్తు లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ పెద్దలు, సిబ్బంది అన్ని ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ పెద్ద లు శేషిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
కల్యాణ మండపానికి రూ.లక్ష విరాళం
పాగుంట వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో నిర్మించే కల్యాణ మండపానికి కర్ణాటకలోని రాయచూరుకు చెందిన ఉప్పె టి గోవిందురెడ్డి రూ.లక్ష విరాళం అందజేశా రు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఆలయ పెద్దలు, అర్చకులు దాతను శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.