బి.మఠంలో ప్రశాంతంగా ఉపసర్పంచ ఎన్నిక
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:26 PM
బ్రహ్మంగారిమఠం మండలంలోని గొడ్లవీడు పంచాయతీలో గురువారం ఉప సర్పంచ ఎన్ని క ప్రశాంతంగా జరిగింది.

బ్రహ్మంగారిమఠం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : బ్రహ్మంగారిమఠం మండలంలోని గొడ్లవీడు పంచాయతీలో గురువారం ఉప సర్పంచ ఎన్ని క ప్రశాంతంగా జరిగింది. ఉదయం 11గంట లకు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇన చార్జ్ ఈవోపీఆర్‌డీ, ఎన్నికల అధికారి సురేశ ఆధ్వర్యంలో ఎన్నికలను నిర్వహించారు. ఈ ఉప సర్పంచ ఎన్నికల్లో వార్డుమెంబర్లు అందరూ కలిసి బద్వేలు రామలక్షుమ్మ అనే ఆమెను ఉప సర్పంచగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి సురేశ తెలిపారు. అనంతరం ఉప సర్పంచ గా ఎన్నికైన రామలక్షుమ్మకు ఎన్నికల అధికారి నియామక పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ బసిరెడ్డి చెన్నక్ర్షిష్ణరెడ్డి, సభ్యులు సిద్దు సిద్దారెడ్డి, గోడె కరుణా కర్‌రెడ్డ్డి, పేరమ్మ, సిద్దు సావిత్రి, బద్వేలు రామిరెడ్డి, మునీశ్వరి, బసిరెడ్డి భాస్కరరెడ్డి, కిన్నెర గురమ్మతో పాటు 8 మంది వార్డుసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగుంట్లలో ఇద్దరు ఉపసర్పంచులు ఏకగ్రీవం
ఎర్రగుంట్ల, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఎర్రగుంట్ల మండలంలో గురువారం జరిగిన రెండు ఉప సర్పంచలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తుమ్మలపల్లె గ్రామ ఉపసర్పంచి ఎన్నికలు ఎంపీడీవో వెంకటరమణయ్య అధ్యక్షత జరిగాయి. 7వ వార్డు సభ్యులరాలు గోర్ల తులశమ్మను ఉప సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిర్రాజుపల్లెలో ఈవోఆర్డీ రంతుల్లయ్య ఆధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో 4వ వార్డు సభ్యురాలు యదలపల్లె సుబ్బమ్మ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 10మంది వార్డు సభ్యులకు గాను 9మంది హాజర య్యారు. సర్పంచి బాలగాని సుమలత పాల్గొన్నారు. ఎంపికైన ఉపసర్పంచులకు ఎంపీ డీవో వెంకటరమణయ్య, ఈవోఆర్డీ రంతుల్లయ్యలు నియామక పత్రాన్ని అందజేశారు. ఎంపికైన వారికి ఇతర వార్డు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.