-
-
Home » Andhra Pradesh » Andhra Pradesh telangana national and international latest news Myanmar Bangkok Earthquake Updates IPL Today Match andhra jyothy news on 31st march 2025 Suri
-

Breaking News: మాజీ మంత్రికి మరోసారి నోటీసులు..
ABN , First Publish Date - Mar 31 , 2025 | 08:24 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-31T13:44:07+05:30
మాజీ మంత్రికి మరోసారి నోటీసులు..
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి మరోసారి నోటీసులు ఇచ్చిన పోలీసులు
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో అక్రమ మైనింగ్‌పై విచారణకు హాజరుకాని కాకాణి
బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ మరోసారి నోటీసులు జారీ
హైదరాబాద్‌లోని మాజీ మంత్రి కాకాణి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన పోలీసులు
ఇంట్లో కాకాణి లేకపోవడంతో ఆయన సమీప బంధువుకి నోటీసులు అందజేత
బుధవారం హాజరు కాకపోతే చట్టపరంగా చర్యలుంటాయని చెప్పిన పోలీసులు
-
2025-03-31T12:55:37+05:30
కొడాలి నానిని ముంబైకి తరలిస్తున్న కుటుంబసభ్యులు.. విషయం ఏంటంటే..
అమరావతి: మాజీమంత్రి కొడాలి నానిని ముంబైకి తరలిస్తున్న కుటుంబసభ్యులు
కొన్ని రోజుల కిందట తీవ్ర అనారోగ్యానికి గురైన వైసీపీ నేత కొడాలి నాని
కొడాలి నానికి 5 రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స
గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న కొడాలి నాని
కొద్దిసేపటి క్రితం ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరిన కుటుంబం
-
2025-03-31T12:01:00+05:30
విద్యార్థులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: ఎంపీ ఈటల
తెలంగాణకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తలమానికం: ఎంపీ ఈటల రాజేందర్
HCU భూములు అమ్మి అప్పులు కట్టాలనే నీచమైన ఆలోచన రేవంత్ ప్రభుత్వం చేస్తుంది: ఈటల
స్మశాన వాటికలకు, పార్కులకు జాగా లేకుండా పోతున్న రోజులివి: ఎంపీ ఈటల
కానీ రేవంత్ రెడ్డి ఎందుకు ఇలాంటి దుర్మార్గపు నిర్ణయాలు తీసుకుంటున్నారు: ఎంపీ ఈటల
తిరోగమన నిర్ణయాలే తప్ప పురోగతి చర్యలు ఒక్కటీ లేవు: ఎంపీ ఈటల
HCU విద్యార్థులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: ఎంపీ ఈటల
వెంటనే ప్రభుత్వ భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: ఎంపీ ఈటల
లేదంటే ప్రత్యక్ష చర్యలతో రంగంలోకి దిగుతాం: ఎంపీ ఈటల
-
2025-03-31T11:46:50+05:30
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిరసనలు.. విద్యార్థులపై చర్యలు..
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీలో నిరసన తెలిపిన విద్యార్థులపై కేసులు నమోదు
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు
పీహెచ్‌డీ స్కాలర్స్ అయిన ఎర్రం నవీన్ కుమార్, డాక్టర్ రోహిత్ బొండుగులపై కేసు నమోదు
బీఎన్ఎస్ సెక్షన్లు 329(3), 118(1), 132, 191(3), 351(3)r/w3(5) కింద కేసులు
ఒకరు ఏబీవీపీ కాగా మరొకరు ఎస్‍ఎఫ్‌ఐ యూనియన్‌కు చెందిన విద్యార్థులు
-
2025-03-31T11:41:14+05:30
మరోసారి దద్దరిల్లిన బీజాపూర్- దంతేవాడ జిల్లాల సరిహద్దులు..
ఛత్తీస్‌గఢ్: దంతేవాడ- బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఎదురుకాల్పులు
మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భారీగా కొనసాగుతున్న ఎదురు కాల్పులు
ఎదురుకాల్పు్ల్లో మహిళా మావోయిస్టు మృతి, ఆమె వివరాలు తెలియాల్సి ఉందన్న అధికారులు
ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
కాగా, ఇరువర్గాల మధ్య కొనసాగుతున్న ఎదురు కాల్పులు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం
-
2025-03-31T11:12:54+05:30
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద భారీ భద్రత..
తెలంగాణ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద భారీ భద్రత ఏర్పాటు
విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద పోలీసుల పహారా
యూనివర్శిటీ లోపల, బయట భారీగా మోహరించిన పోలీసులు
యూనివర్సిటీలోని 400 ఎకరాలను బుల్డోజర్లతో చదును చేసేందుకు అధికారుల యత్నం
దీనిపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు, యూనివర్శిటీ సిబ్బంది
యూనివర్సిటీ భూములను చదును చేయడాన్ని ఆపాలంటూ గళమెత్తిన విద్యార్థులు
దీంతో నిన్న రాత్రి రణరంగంగా మారిన యూనివర్శిటీ ప్రాంగణం
యూనివర్శిటీ వద్ద నిన్న రాత్రి ఉద్రిక్తత, పలువురు విద్యార్థులు అరెస్టు
అరెస్ట్ చేసిన విద్యార్థులను, విద్యార్థి నేతలను రాత్రి 10 తర్వాత విడుదల చేసిన పోలీసులు
ఇవాళ్లా ఆందోళనలు కొనసాగే అవకాశం, దీంతో అలెర్ట్ అయిన పోలీసులు
-
2025-03-31T10:46:00+05:30
అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద గందరగోళం..
తిరుమల: అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద మరోసారి భద్రతా వైఫల్యం
చెకింగ్ పాయింట్ వద్ద ద్విచక్రవాహనాన్ని నిలపకుండానే దూసుకెళ్లిన వ్యక్తి
నిందితుడిని తిరుపతి సింగాలగుంటకి చెందిన అమీర్ అంజద్ ఖాన్‍గా గుర్తింపు
నిలువరించేందుకు సిబ్బంది యత్నించినా బైక్‌పై దూసుకెళ్లిన అంజద్ ఖాన్
ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన తిరుమల భద్రతా సిబ్బంది
నిందితుడిని తిరుమల జీఎన్సీ టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ సిబ్బంది
భద్రతా వలయాన్ని తప్పించుకుని ఎందుకు వెళ్లావంటూ ప్రశ్నిస్తున్న అధికారులు
-
2025-03-31T09:21:53+05:30
దారుణం.. మహిళపై 8 మంది అత్యాచారం..
నాగర్ కర్నూల్: ఊరుకొండ మండలంలో దారుణం
దైవ దర్శనానికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులు
ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లిన మహిళపై అత్యాచారం చేసిన 8 మంది కామాంధులు
మహిళ బంధువుపై దాడి చేసి ఆమెను చెట్ల పొదల్లోకి లాక్కెళ్లిన దుర్మార్గులు
శనివారం రాత్రి అత్యాచారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, ఘటనపై కేసు నమోదు
ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మరో ఇద్దరు నిందితులు పరార్, గాలింపు చర్యలు ముమ్మరం
-
2025-03-31T08:33:05+05:30
బెట్టింగ్ యాప్స్ కేసు.. డీజీపీ జితేందర్ కీలక ఆదేశాలు..
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ కేసు విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు
ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన డీజీపీ జితేందర్
సిట్ సభ్యులుగా ఐటీ ఎం.రమేశ్, ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, శంకర్ నియామకం
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై హైదరాబాద్ పంజాగుట్ట, మియాపూర్‌లో రెండు కేసులు నమోదు
25 మంది టాలీవుడ్, బాలీవుడ్, యూట్యూబర్స్, టీవీ యాంకర్లపై కేసులు నమోదు
ఆ రెండు కేసులనూ సిట్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన డీజీపీ జితేందర్
90 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక అందించాలని సిట్‍కు డీజీపీ ఆదేశం
-
2025-03-31T08:24:26+05:30
దారుణం.. కొట్టి చంపేశారు..
వరంగల్: సంగెం మండలం గవిచర్లలో గుండాబ్రహ్మయ్య జాతరలో యువకుల మధ్య ఘర్షణ
ఘర్షణలో కుంటపల్లికి చెందిన బన్ని అనే యువకుడిపై దాడి చేసిన మరికొందరు యువకులు
తీవ్రగాయాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు, స్నేహితులు
బలమైన గాయాలు కావడంతో చికిత్సపొందుతూ మృతిచెందిన బన్ని
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు