Sanju Samson: సంజూ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. కెప్టెన్‌నే మార్చేశారు
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:13 PM
Rajasthan Royals New Captain: సంజూ శాంసన్ అభిమానులకు షాకింగ్ న్యూస్. అతడి స్థానంలో 23 ఏళ్ల ఓ యంగ్‌స్టర్‌ను కెప్టెన్‌గా నియమించింది రాజస్థాన్ రాయల్స్. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్-2025 ఆరంభానికి ఇంకా రెండ్రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ సారథిని మార్చేసింది. రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ ప్లేస్‌లో ఓ 23 ఏళ్ల కుర్రాడికి సారథ్య పగ్గాలు అప్పజెప్పింది. ఈ సీజన్‌లోని మొదటి 3 మ్యాచులు అతడి సారథ్యంలోనే ఆడనుంది రాజస్థాన్. అసలు.. సంజూ శాంసన్‌కు ఏమైంది.. అతడి ప్లేస్‌లో నయా కెప్టెన్‌ను నియమించాల్సిన అవసరం ఏం వచ్చింది.. అసలు రాయల్స్ కొత్త సారథి ఎవరు.. అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
అతడికే ఎందుకు..
యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్‌ను తాత్కాలిక సారథిగా నియమించింది రాజస్థాన్ రాయల్స్. ఈ ఐపీఎల్ సీజన్‌లోని తొలి 3 మ్యాచుల్లో జట్టును అతడు ముందుండి నడిపించనున్నాడు. మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్, 26న కోల్‌కతా నైట్ రైడర్స్, 30న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచుల్లో రాజస్థాన్‌ను లీడ్ చేయనున్నాడు పరాగ్. సంజూ శాంసన్ పూర్తి ఫిట్‌గా లేకపోవడంతోనే రియాగ్‌ను టెంపరరీ కెప్టెన్‌గా నియమించినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ టెస్ట్‌లో అతడికి పూర్తి క్లియరెన్స్ రాకపోవడంతో మొదటి 3 మ్యాచుల్లో కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాడు సంజూ. యశస్వి జైస్వాల్ రూపంలో ప్రతిభ, అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాడు ఉన్నా పరాగ్‌లోని లీడర్‌షిప్ స్కిల్స్, నమ్మకాన్ని చూసే అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఒకవేళ అతడు గానీ సక్సెస్ అయితే.. నెక్స్ట్ వైస్ కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. మరి.. పరాగ్ ఫ్రాంచైజీ నమ్మకాన్ని ఎంతమేరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.
ఇవీ చదవండి:
చాహల్ గర్ల్‌ఫ్రెండ్ సంచలన పోస్ట్
ప్రధాని గల్లీ క్రికెట్.. లెజెండ్‌తో కలసి..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి