Share News

DMK: నోరు జారిన మాట.. చేజారిన పదవి.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Mar 20 , 2025 | 01:19 PM

ఒక్క నోటిమాట ఆయన పదవికే ఎసరు తెచ్చింది. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలని పెద్దలు ఊరికే చెప్పలేదు కాబోలు. పార్టీ పదవిని చేపట్టిన 24 రోజుల్లోనే డీఎంకే ధర్మపురి తూర్పు జిల్లా కార్యదర్శి పి.ధర్మసెల్వన్‌ను ఆ పదవి నుండి పార్టీ అధిష్టానం తొలగించింది.

DMK: నోరు జారిన మాట.. చేజారిన పదవి.. ఏం జరిగిందంటే..

- పార్టీ పదవి చేపట్టిన 24 రోజులకే ధర్మపురి డీఎంకే నేతకు ఉద్వాసన

చెన్నై: పార్టీ పదవిని చేపట్టిన 24 రోజుల్లోనే డీఎంకే(DMK) ధర్మపురి తూర్పు జిల్లా కార్యదర్శి పి.ధర్మసెల్వన్‌(P. Dharmaselwan)ను ఆ పదవి నుండి పార్టీ అధిష్టానం తొలగించింది. పెన్నగరం శాసనసభ నియోజకవర్గం పరిధిలో కూత్తంపాడికి చెందిన ధర్మసెల్వన్‌ డీఎంకేలో ప్రధాన కార్యాచరణ మండలి సభ్యుడిగా, వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఫిబ్రవరి 22న ధర్మపురి తూర్పు జిల్లా కార్యదర్శిగా ఉన్న తడంగం సుబ్రమణియంను ఆ పదవి నుండి తొలగించి, ధర్మసెల్వన్‌ను డీఎంకే ప్రధాన కార్యదర్శి, నీటి వనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌(Minister Durai Murugan) నియమించారు.

ఈ వార్తను కూడా చదవండి: Dairy Development: పాల ఉత్పత్తికి దన్ను


ధర్మసెల్వన్‌ జిల్లా కార్యదర్శి పదవి చేపట్టిన వారం రోజులకే ధర్మపురి, పెన్నాగరం శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీకి, ప్రభుత్వానికి కళంకం తెచ్చేలా ప్రవర్తించారు. జిల్లాలో కలెక్టర్‌, ఎస్పీ ఇలా ఎంత పెద్ద అధికారి అయినా సరే తన మాటకు కట్టుబడాలి లేకుంటూ వెళ్ళిన ప్రతిచోటా మాట్లాడారు. ఈ మాటలను ఎవరో సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ విషయం తెలియగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పాలకపక్షంపై ధ్వజమెత్తారు.


nani2.jpg

ప్రభుత్వ ఉన్నతాధికారులను డీఎంకే స్థానిక నేతలు బహిరంగంగా బెదరించే స్థాయికి ఎదిగిపోయారంటూ విమర్శించారు. ఈ పరిస్థితులలోనే ధర్మసెల్వన్‌ను పార్టీ పదవి నుండి తొలగిస్టున్న దురైమురుగన్‌ ప్రకటించారు. అదే సమయంలో ధర్మపురి తూర్పు జిల్లా శాఖకార్యదర్శిగా ధర్మపురి ఎంపీ, న్యాయవాది ఎ. మణిని నియమిస్తున్నట్లు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Minister: ఇక.. ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు..

MLA: మద్యం ప్రియులకు రెండు బాటిళ్లు ఉచితంగా ఇవ్వండి

RTC bus: అమ్మో.. పెద్దప్రమాదమే తప్పిందిగా.. ఏం జరిగిందంటే..

Updated Date - Mar 20 , 2025 | 02:01 PM