Share News

Navy Officer Case: నాన్న డ్రమ్ములో ఉన్నాడు.. నేవీ అధికారి కేసులో కన్నీరు పెట్టిస్తున్న కుమార్తె వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 20 , 2025 | 01:01 PM

నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ దారుణ హత్యాకాండలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సౌరభ్ భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి అత్యంత దారుణంగా నేవీ అధికారిని హత్య చేసి 15 ముక్కలుగా కత్తిరించి..

Navy Officer Case: నాన్న డ్రమ్ములో ఉన్నాడు.. నేవీ అధికారి కేసులో కన్నీరు పెట్టిస్తున్న కుమార్తె వ్యాఖ్యలు
Navy Officer Case

లక్నో, మార్చి 20: పుట్టిన రోజు సందర్భంగా కుమార్తెకు సర్ప్రైజ్ ఇద్దామని భావించి.. ఇంటికి వచ్చిన మేరఠ్ మర్చంట్ నేవీ అధికారి.. అనూహ్య రీతిలో.. భార్య చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో మృతి చెందిన నేవీ అధికారి భార్య, ఆమె ప్రియుడు ప్రధాన నిందితులుగా తేలింది. ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన నేవీ అధికారి కుమార్తె చెప్పిన మాటల వల్లనే.. అతడి డెడ్ బాడీ వెలుగులోకి వచ్చిందని సమాచారం. తండ్రి మరణం గురించి ఆరు సంవత్సరాల ఆ చిన్నారి చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఆ వివరాలు..


మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ దారుణ హత్యాకాండలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సౌరభ్ భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి అత్యంత దారుణంగా నేవీ అధికారిని హత్య చేసి 15 ముక్కలుగా కత్తిరించి సిమెంట్ డ్రమ్ములో దాచారు. అయితే సౌరభ్ మృతదేహం డ్రమ్ములో ఉందనే విషయం అతడి ఆరేళ్ల కుమార్తె మాటల ద్వారా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సౌరభ్ రాజ్‌పుత్ తన కుమార్తె పుట్టిన రోజు జరపడం కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండియా వచ్చాడు. అయితే అప్పటికే ముస్కాన్ రస్తోగి తన భర్త సౌరభ్‌ను అంతమొందించాలనుకుంది. ఇందుకోసం తన ప్రియుడితో కలిసి పథకం రచించింది. దాని ప్రకారం.. మార్చి 4 రాత్రి సౌరభ్ తినే భోజనంలో నిద్ర మాత్రలు కలిపి వడ్డించింది. తిన్న తర్వాత మత్తులోకి వెళ్లిన సౌరభ్‌పై ప్రియుడు సాహిల్తో కలిసి కత్తితో దాడి చేసి.. అంతమొందించింది. ఆ తర్వాత నిందితులిద్దరు.. సౌరభ్ శరీరాన్ని 15 ముక్కలుగా చేసి.. ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి.. తడి సిమెంట్ తో నింపేశారు. డ్రమ్మును ఇంట్లోనే ఉంచి.. ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్.. హిమాచల్ ప్రదేశ్, మనాలీకి ట్రిప్పుకు వెళ్లారు.


ఈ దారుణం గురించి సౌరభ్ తల్లి రేణు దేవి మాట్లాడుతూ.. ’’నా కొడుకు మృతి గురించి నా మనవరాలు ముందుగా తెలియజేసింది. ’’మా నాన్న డ్రమ్ములో ఉన్నాడు‘‘ అని నా మనవరాలు ఇరుగుపొరుగు వారి దగ్గర చెప్పసాగింది. అయితే తన మాటలను వారు పెద్దగా పట్టించుకోలేదు. ఇక కుమార్తె మాటలు విన్న ముస్కాన్.. ఆ చిన్నారి తము చేసిన దారుణాన్ని చూసిందని.. తను ఇక్కడే ఉంటే ప్రమాదమని భావించి.. ఆమెను అక్కడ నుంచి తీసుకెళ్లారు‘‘ అని చెప్పుకొచ్చింది.


రేణు దేవి మాట్లాడుతూ.. ‘ముస్కాన్ ట్రిప్పుకు వెళ్లడానికి ముందే.. ఇంటి ఓనర్.. రినోవేషన్ వర్క్ చేయించాలని.. అందుకోసం ఆమెను రూమ్ ఖాళీ చేయమని చెప్పాడు. ముస్కాన్ ట్రిప్పు నుంచి వచ్చిన తర్వాత రూమ్ ఖాళీ చేయించడం కోసం రూమ్ ఓనర్ పని వాళ్లను పంపాడు. అలా వచ్చిన వారికి ముస్కాన్ రూమ్ లో ఓ డ్రమ్ము కనిపించింది. దాని గురించి ముస్కాన్ ను ప్రశ్నించగా.. దానిలో కేవలం చెత్త ఉంది అని తెలిపింది. పనివారు డ్రమ్ము మూత తెరవగా.. దుర్వాసన గుప్పుమన్నది. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలికి చేరుకునేలోపే ముస్కాన్ తన పుట్టింటికి వెళ్లింది. పోలీసులు డ్రమ్మును కత్తిరించి చూడగా.. సిమెంట్లో కలిసిపోయిన శరీర భాగాలు వెలుగులోకి వచ్చాయి’ అని చెప్పుకొచ్చింది.

అనంతరం రేణు దేవి మాట్లాడుతూ.. తన కుమారుడిని ఇంత దారుణంగా హత్య చేసినందుకుగాను ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ తో పాటుగా.. ముస్కాన్ కుటుంబ సభ్యులను అందరిని ఉరిదీయాలని కోరింది. ముస్కాన్, సాహిల్ ల మధ్య ఉన్న వివాహేతర బంధమే ఈ దారుణానికి కారణం అని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Also Read:

ఇక.. ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు..

ప్రధాని గల్లీ క్రికెట్.. ఆట మామూలుగా లేదు

బిగ్ బ్రేకింగ్.. రానా, ప్రకాష్ రాజ్‌పై కేసు నమోదు..

For More National News and Telugu News..

Updated Date - Mar 20 , 2025 | 04:29 PM