రాచమల్లు ధనదాహంతోనే బీసీలకు అన్యాయం
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:56 PM
వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే రాచ మల్లు ప్రసాద్‌రెడ్డి ధనదాహం వల్లే గోప వరం ఉప సర్పంచ బీసీలకు దక్కనీయకుం డా కుట్ర చేశాడని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆరోపించారు.

ఉపసర్పంచ ఎన్నిక వాయిదాకు కారణం అతనే
ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోపణలు
ప్రొద్దుటూరు , మార్చి 28 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే రాచ మల్లు ప్రసాద్‌రెడ్డి ధనదాహం వల్లే గోప వరం ఉప సర్పంచ బీసీలకు దక్కనీయకుం డా కుట్ర చేశాడని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆరోపించారు. శుక్రవారం స్ధానిక టీడీపీ కార్యా లయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గోపవరం సర్పంచ ఎన్నిక సందర్బంగా ఉపస ర్పంచ పదవి కావాల్సిన వారు డబ్బులు పెట్టుకోమని చెప్పి బీరం రాఘ వేంద్రరెడ్డి, కొండయ్యలతో చేరి సగం ఖర్చు రాచమల్లు పెట్టించారన్నారు. తిరిగి ఆలస్యంగా ఎన్నికల నోటిఫికేషన వచ్చాక బీసీ మహిళ రమాదేవికి ఉపసర్పంచ పదవి కట్టబ్టెకుండా మళ్ళీ బీరం రాఘవేంద్రారెడ్డితో డబ్బులు తీసుకోని బీసీ మహిళకు అన్యాయం చేసిన నీచుడు రాచమల్లు అన్నారు. నిన్న ఉపసర్పంచ ఎన్నిక కోరం లేకపోవడంతో మొదటి రోజు వాయిదా పడిందన్నారు. ఎన్నిక సమయంలో రమాదేవి తనకు అన్యాయం జరగడంపై ఆవేధన చెంది అక్కడ గొడవ చేసిందన్నారు. ఆవాతావరణానికి ఎన్నికల అధికారి రామాంజనేయలురెడ్డికి అనారోగ్యంతో గుండెపోటు వచ్చి ఎన్నికనువాయిదా వేశారన్నారు.దీనికి రాచమల్లు ధనదాహం తప్ప మరొకటి కాదన్నారు. రిటైర్ట్ ఎస్‌ఐ శంకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఎన్నికను వాయిదా వేయించాడని రాచమల్లు మాట్లాడుటం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు పగిడాల దస్తగిరి, మాజీ కౌన్సిలర్ వద్దిబాలుడు, మాజీ ఎంపీ టీసీ చంద్ర ఓబులరెడ్డి, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.