అనుమానాస్పద స్థితిలో గొర్రెల కాపరి మృతి
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:20 AM
మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన వారాధి అప్పలకృష్ణ(44) జాగరం గెడ్డలో పడి అనుమానాస్పద స్థితి లో మృతి చెందారు.

జామి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన వారాధి అప్పలకృష్ణ(44) జాగరం గెడ్డలో పడి అనుమానాస్పద స్థితి లో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అప్పలకృష్ణ ఆది వారం ఒక మహిళ చనిపోవడంతో అమె అంత్యక్రియలకు వెళ్లి వచ్చాడు. అ నంతరం గొర్రెల మేపునకు వెళ్లిపోయాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం మొదలుపెట్టారు. అయితే జాగరం గెడ్డలో ఒక వ్యక్తి చనిపోయి మృతదేహాం తేలిందని తెలియడంతో అక్కడకు వెళ్లి చూశారు. అది అప్పలకృష్ణగా కుటుంబ సభ్యులు గుర్తించారు. ఎటు వంటి ఇబ్బందులులేని కృష్ణ మరణం పలు అనుమానాలకు దారితీసింది. భార్య గౌరి మాత్రం తన భర్త ప్రమాదవశాత్తు గెడ్డలో పడి చనిపోయినట్టు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్‌ఐ వీరజనార్దన్ తెలిపారు.