Share News

ఇన్‌చార్జిల ఏలుబడిలో ..

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:23 AM

జిల్లాలోని దేవాలయాల అభివృద్ధి కుంటు పడుతోంది. పాలకులు, ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో పాలనా వ్యవహారాలు స్తంభిస్తున్నాయి.

ఇన్‌చార్జిల ఏలుబడిలో ..

జిల్లాలో 716 దేవాలయాలు, సత్రాలు, మఠాలు

పర్యవేక్షించేది 23 మందే ఈవోలే..

చాలా చోట్ల గుమస్తాలే దిక్కు

దేవుడి మాన్యాలకు ఆక్రమణల చెర

(ఏలూరు– ఆంధ్రజ్యోతి) :

జిల్లాలోని దేవాలయాల అభివృద్ధి కుంటు పడుతోంది. పాలకులు, ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో పాలనా వ్యవహారాలు స్తంభిస్తున్నాయి. కార్యనిర్వహణాధికారులు (ఈవోలు), సిబ్బంది కొరత కారణంగా దిశా నిర్దేశనం చేసేవారే లేకుండా పోయారు. కొన్నిచోట్ల ఆలయాల్లో కనీస సౌకర్యాలు లేని దుస్థితి. ఏళ్ల తరబడి ఇన్‌ఛార్జుల పాలనలోనే కొనసాగు తున్నాయి. సిబ్బంది కొరత కారణం గా ఒక్కో అధికారి 10 నుంచి 20 ఆలయాలు బాధ్యతలు చూస్తున్నారు. ప్రత్యేక పర్వదినాలు, ఉత్సవాల సమయంలో తప్ప మామూలు రోజుల్లో ఆలయాలకు వస్తున్న దాఖలాలు లేవు. జిల్లాలో 716 దేవాలయాల పరిధిలో 12,870 ఎకరాలు భూములున్నాయి. ఇందులో 5,400 ఎకరాలు మాగాణి ఉండగా, 6,291 ఎకరాల్లో మెట్ట భూములున్నాయి. 964 ఎకరాల్లో చేపల చెరువులున్నాయి. ఇక మిలి గినవన్నీ కొండ, డ్రై ల్యాండ్స్‌ కింద చెబుతు న్నారు. క్షేత్రస్థాయి పరిశీలనకు సిబ్బందే లేక పోవడంతో వీటి రక్షణ కంటే భక్షణే ఎక్కువగా జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. వైసీపీ ప్రభుత్వం హయాంలో గ్రూప్‌–4 ద్వారా పోస్టు ల భర్తీ చేయగా, ఆరుగురు వరకు ఈవోలు జిల్లాకు వచ్చారు. అయితే అనుకున్నంత రీతిలో దేవదాయశాఖలో ఉద్యోగాల భర్తీ లేక అనేక ఇబ్బందులు నెలకొన్నాయి. పర్యవేక్షణ లోపంతో ఆస్తులు అన్యాక్రాంతమవు తున్నా యి. ఆదాయానికి గండి పడుతోంది. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగట్లేదు. ఉన్న సిబ్బంది పనిభారంతో సతమతం అవుతున్నారు.

జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఈవోల కొరత తీవ్రంగా ఉంది. ఈవోలపై పనిభారం అధికంగానే ఉంటుంది. వేలం పాటలు, ఆదాయాలు వసూళ్లు, భూముల పరిశీలన తదితరాల్లో పెనుభారమే మోస్తు న్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రేడ్‌ 1– ఈవోలు ఏడుచోట్ల, గ్రేడ్‌ –2 ఈవోలు 7 చోట్ల, గ్రేడ్‌ –3 ఈవోలు 9 చోట్ల మాత్రమే ఉన్నారు. మొత్తం 23 మందే ఉన్నారు. ఆదాయాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో ఈవోల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవ సరం ఉందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. దేవాలయాలకు చెందిన భూములు కౌలు, వేలంపాట, దుకాణాల అద్దెల వసూలు సక్ర మంగా జరగట్లేదు. హుండీల ఆదాయం, దేవతా మూర్తుల ఆభరణాల భద్రత కరవు తోంది. కొన్ని ఆలయాలకు కోట్ల విలువైన భూములున్నా.. అవన్నీ ఆక్రమణలకు గురి కావడంతో దూపదీప నైవేద్యాలు, ఉత్స వా ల నిర్వహణకు సొమ్ముల్లేని పరిస్థితి. ఆక్ర మణ భూములపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దేవదాయశాఖకు ఆదాయంతో పాటు లబ్ధిదారులకు ప్రయోజనం కలుగు తుంది. ఈ సమస్యపై దశాబ్దాలుగా నిర్ణ యం తీసుకోకపోవడంతో ఆలయాలకు ఆదాయం రాకపోగా ఉత్సవాలకు దాతలు, విరాళాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ అంశాలపై దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమి షనర్‌ సీహెచ్‌ రంగారావును వివరణ కోర గా.. ‘ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రూప్‌ టెం పుల్స్‌కు ఈవోలనే ఎక్కువగా ఇన్‌చార్జి బా ధ్యతలు అప్పగిస్తున్నాం. ట్రస్టీల పరిధిలోనే గుమస్తాలను ఆయా పాలక వర్గాలు ఏర్పా టు చేసుకుంటాయి. ఆదాయానికి గండికొట్టే వారిని ఊపేక్షించేది లేదు’ అంటూ స్పష్టం చేశారు.

Updated Date - Apr 01 , 2025 | 12:23 AM