Share News

డోలీ మోతలు లేకుండా చేయడమే లక్ష్యం

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:02 AM

గిరిశిఖర గ్రామాల్లో డోలీ మోతలు లేకుండా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి అన్నారు.

డోలీ మోతలు లేకుండా చేయడమే లక్ష్యం
తారురోడ్డును ప్రారంభిస్తున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామాల్లో డోలీ మోతలు లేకుండా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి అన్నారు. ఎడ్యుకేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిధులు రూ.కోటీ 25 లక్షలతో పడాలవలస నుంచి సిమిడి వల స వరకు (వయా కొత్తూరు) నిర్మించిన తారు రోడ్డు ను ఆమె సోమవారం ప్రారంభించారు. ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. థింసా, కోలాటం నృత్యాలతో గిరిజనులు ఆహ్వానించారు. అనంతరం సిమిడివలసలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి గిరిజన గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టి డోలీ మోతలు లేని గ్రామా లను చూడటమే ఈ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. గిరి శిఖర గ్రామాల రహదారుల నిర్మాణం కోసం ప్రభు త్వం సుమారు రూ.500 కోట్లు కేటాయించిందని తెలి పారు. ఇప్పటికే సాలూరు నియోజకవర్గంలో సుమారు రూ.83 కోట్లతో రహదారుల నిర్మాణం జరుగుతుంద ని అన్నారు. గిరిశిఖర గ్రామాల్లో ఉన్న తన అక్క చెల్లెమ్మలు ఇబ్బందులు పడితే సహించలేనని అన్నారు. మండలంలో మరో మూడు రోడ్లు కురుకూట్టి నుంచి సంపంగిపాడు, కొదమ నుంచి బందపాయి- చింతామల రోడ్డు, తాడిలోవ నుంచి మారయ్యపాడుకు రోడ్లు నిర్మాణానికి రూ.30కోట్లతో నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టుచెన్నారు, పగులుచెన్నారు, తోణాం గ్రామాలకు చెందిన సుమారు 250 కుటుంబాలకు చెందిన ప్రజలు, నాయకులు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. పార్టీలోకి చేరిన వారిని కండువాలతో మంత్రి సాదారంగా ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పరమేష్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖీ సూర్యనారాయణ, రొంపల్లి వెంకటేష్‌, అప్పికొండ రమాదేవి, శ్యామ్‌, యుగంధర్‌, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

నిందితులను పట్టుకోవాలని ఆదేశించాం

సాలూరు మండలం కందులపధం పంచాయతీ మర్రివానివలస గ్రామానికి చెందిన వాటిక ఐశ్వర్య అనుమానాస్పద మృతిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి, బాధ్యులను కోర్టు ముందు ఉంచాలని ఆ శాఖకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి తెలిపారు. 24 గంటల్లోనే కేసును ఛేదించి, నిందితులను పట్టుకున్నందుకు ఆమె పోలీసు అధికారులను అభినందించారు.

Updated Date - Apr 01 , 2025 | 12:02 AM