సాంకేతికత ఆధారంగా నేరాలపై నిఘా
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:09 AM
సాంకేతికత ఆధారంగా నేరాల కట్టడిపై దృష్టి పెట్టామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి కర్నూలు జిల్లా పోలీసు శాఖకు కేటాయించిన డ్రోన్ కెమెరా పనితీరును ఏపీఎ్‌సపీ రెండో బెటాలియన్‌లో ఆయన పరిశీలించారు.

డ్రోన్ పని తీరును పరిశీలించిన ఎస్పీ
కర్నూలు క్రైం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): సాంకేతికత ఆధారంగా నేరాల కట్టడిపై దృష్టి పెట్టామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి కర్నూలు జిల్లా పోలీసు శాఖకు కేటాయించిన డ్రోన్ కెమెరా పనితీరును ఏపీఎ్‌సపీ రెండో బెటాలియన్‌లో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని స్మార్ట్ పోలిసింగ్‌తో నేరాలను నియంత్రించడానికి డ్రోన్ సాంకేతికతను ఉపయోగించే విదంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎ్‌సపీ రెండో బెటాలియన్ డీఎస్పీ రమణ, స్పెషల్ బ్రాంచ్ సీఐ తేజోమూర్తి, కర్నూలు నాల్గవ పట్టణ సీఐ మధుసూదన్ గౌడు ఇతర అధికారులు ఉన్నారు.