Share News

చివరి ధాన్యపు గింజా కొనాలి

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:20 AM

రైతుల నుంచి చివరి ధాన్యపు గింజా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని ఏపీ కౌలు రైతు సంఘంజిల్లా సహాయ కార్యదర్శి శీలం నారాయణరావు డిమాండ్‌ చేశారు.

చివరి ధాన్యపు గింజా కొనాలి

నెలఖారు వరకే ధాన్యం కొంటామనడం సరికాదు

జిల్లాలో ఇంకా 30 శాతం వరి కుప్పలు నూర్చాలి

ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలి: కౌలు రైతు సంఘంజిల్లా సహాయ కార్యదర్శి శీలం నారాయణరావు

కూచిపూడి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి చివరి ధాన్యపు గింజా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని ఏపీ కౌలు రైతు సంఘంజిల్లా సహాయ కార్యదర్శి శీలం నారాయణరావు డిమాండ్‌ చేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ఈనెల 31వ తేదీ వరకు మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సరికాదని, ఇది రైతులను ఆందోళనకు గురిచేస్తోందని ఆయన అన్నారు. జిల్లాలో 30 శాతం వరి కుప్పలు నూర్చాల్సి ఉందని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మార్చి నెలాఖరు వరకే కొనుగోలు చేస్తామనటం వల్ల రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతారని ఆయన అన్నారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకుని, ఇచ్చిన హామీ మేరకు చివరి గింజ వరకు రైతుల నుంచి కొనుగోలు చేయాలని నారాయణరావు డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 22 , 2025 | 12:20 AM

News Hub