Share News

విద్యార్థులు క్రమశిక్షణ, విలువలతో విద్యనభ్యసించాలి

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:23 AM

విద్యార్థులు క్రమశిక్షణ, విలువలతో విద్యన భ్యసించి స్వర్ణాంధ్ర 2047 కలలను సాకారం చేయాలని జిల్లా సైన్స్‌ అధికారి మైనం హుస్సేన్‌, సమగ్ర శిక్ష ఏఎంవో అశోక్‌లు తెలిపారు.

విద్యార్థులు క్రమశిక్షణ,   విలువలతో విద్యనభ్యసించాలి
విజేతలకు బహుమతులు అందజేస్తున్న సైన్స్‌ అధికారి హుస్సేన్‌ తదితరులు

విద్యార్థులు క్రమశిక్షణ,

విలువలతో విద్యనభ్యసించాలి

లబ్బీపేట, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు క్రమశిక్షణ, విలువలతో విద్యన భ్యసించి స్వర్ణాంధ్ర 2047 కలలను సాకారం చేయాలని జిల్లా సైన్స్‌ అధికారి మైనం హుస్సేన్‌, సమగ్ర శిక్ష ఏఎంవో అశోక్‌లు తెలిపారు. బిషప్‌ హజరయ్య హైస్కూల్‌లో స్వర్ణాంధ్ర 2047 సాధించడానికి పీ4(పబ్లిక్‌, పిపుల్‌, ప్రైవేట్‌, పార్టనర్‌షిప్‌) ఏవిధంగా ఉపయోగించుకోవచ్చు అనే అంశంపై 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు జిల్లా స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ, పోస్టర్‌ మేకింగ్‌ తదితర పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అసిస్టెంట్‌ ఏఎంవో శిరీషారాణి, నోడల్‌ ఆఽఫీసర్‌ కె.సుధాకర్‌, జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 12:23 AM