Share News

బాలికపై అత్యాచారం కేసులో మరో నలుగురి అరెస్టు

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:36 AM

బాలికపై అత్యాచారం కేసులో మరో నలుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా అడ్మిన్‌ అడిషనల్‌ ఎస్పీ వీవీ నాయుడు తెలిపారు.

బాలికపై అత్యాచారం కేసులో మరో నలుగురి అరెస్టు
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న అడ్మిన్‌ అడిషనల్‌ ఎస్పీ వీవీ నాయుడు

గన్నవరం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): బాలికపై అత్యాచారం కేసులో మరో నలుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా అడ్మిన్‌ అడిషనల్‌ ఎస్పీ వీవీ నాయుడు తెలిపారు. గన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో స్థానిక విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. కొండేటి అనిల్‌, ఉయ్యూరు నవీన్‌ కుమార్‌, పరస సంజయ్‌ వర్ధన్‌, పరస రాజశ్‌ను అరెస్టు చేశామని ఆ యన తెలిపారు. ఇంతకు ముందు ఇద్దరిని, ఇప్పుడు నలు గురు, ఇద్దరు మైనర్లతో కలిపి ఈ కేసులో ఉన్న 8 మంది నిందితులనూ అరెస్టు చేసినట్లు తెలిపారు. డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు, హనుమాన్‌ జంక్షన్‌ సీఐ కేవీవీఎన్‌ సత్యనారాయణ, ఆత్కూరు ఎస్సై చావా సురేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 01:36 AM