Share News

నూతన ఆవిష్కరణలు రూపొందించాలి

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:52 AM

రైతులకు అధిక ఆదాయం చేకూర్చే విధంగా నూతన ఆవిష్కరణలు రూపొందించాలని కలెక్టర్‌ డీకే బాలాజీ యువ వ్యవసాయ పారిశ్రామిక వేత్తలను కోరారు. మండలంలోని ఆత్కూరు స్వర్ణభారతట్రస్ట్‌లోని ముప్పవరపు ఫౌండేషన -విజ్ఞానవికాస కేంద్రంలో ఎలీప్‌ ఇండియా, సెంటర్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ (సీఈడీ), నోడల్‌ ట్రైనింగ్‌ ఇనస్టిట్యూట్‌ సంయుక్తంగా 45రోజులపాటు అగ్రి క్లినిక్స్‌, అగ్రి బిజినెస్‌లో నిర్వహించిన శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న విద్యార్థులు ఆదివారం ఉగాది సంబరాల్లో పాల్గొనేందుకు ట్రస్ట్‌కు విచ్చేసిన సీఎం చంద్రబాబునాయుడిని కలిసి ఫోటో దిగేందుకు ముచ్చటపడ్డారు. వారి కోర్కేను తీర్చిన సీఎం అక్కడనుంచి ప్రాంగణంలోని వివిధ శిక్షణా కేంద్రాల సందర్శనకు వెళ్లారు.

నూతన ఆవిష్కరణలు రూపొందించాలి
అగ్రిక్లినిక్స్‌-అగ్రి బిజినెస్‌లో శిక్షణ పొందిన విద్యార్థులతో సీఎం చంద్రబాబు, పక్కన ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌

ఉంగుటూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : రైతులకు అధిక ఆదాయం చేకూర్చే విధంగా నూతన ఆవిష్కరణలు రూపొందించాలని కలెక్టర్‌ డీకే బాలాజీ యువ వ్యవసాయ పారిశ్రామిక వేత్తలను కోరారు. మండలంలోని ఆత్కూరు స్వర్ణభారతట్రస్ట్‌లోని ముప్పవరపు ఫౌండేషన -విజ్ఞానవికాస కేంద్రంలో ఎలీప్‌ ఇండియా, సెంటర్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ (సీఈడీ), నోడల్‌ ట్రైనింగ్‌ ఇనస్టిట్యూట్‌ సంయుక్తంగా 45రోజులపాటు అగ్రి క్లినిక్స్‌, అగ్రి బిజినెస్‌లో నిర్వహించిన శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న విద్యార్థులు ఆదివారం ఉగాది సంబరాల్లో పాల్గొనేందుకు ట్రస్ట్‌కు విచ్చేసిన సీఎం చంద్రబాబునాయుడిని కలిసి ఫోటో దిగేందుకు ముచ్చటపడ్డారు. వారి కోర్కేను తీర్చిన సీఎం అక్కడనుంచి ప్రాంగణంలోని వివిధ శిక్షణా కేంద్రాల సందర్శనకు వెళ్లారు. ఈక్రమంలో సీఎం వెంట వచ్చిన కలెక్టర్‌ బాలాజీ, జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మలతో కూడా విద్యార్థులు ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వ్యవసాయ అనుబంధరంగాల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో వ్యవసాయ సాగు విధానాలను పరిశీలించాలన్నారు. రైతులు పంటలు ఎలా పండిస్తున్నారు. ఏమి చేస్తే అధిక ఆదాయం పొందగలరో ఒకసారి ఆలోచించాలన్నారు. అగ్రికల్చర్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుంచి అన్నివిధాల సహకారం అందిస్తామని తెలిపారు. భూసార పరీక్షలు, పంటల సాగు, ప్రకృతి వ్యవసాయంలో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణా కేంద్రం నోడల్‌ ఆఫీసర్‌ పోలవరపు శోభారాణి, కోఆర్డినేటర్‌ మైనేని నళిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 12:52 AM