శేషజీవితం ఆనందంగా గడపాలి
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:22 AM
: పదవీ విరమణ చేసిన సిబ్బంది శేషజీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు.

శేషజీవితం ఆనందంగా గడపాలి
పదవీ విరమణ కార్యక్రమంలో
సీపీ రాజశేఖరబాబు
గుణదల, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): పదవీ విరమణ చేసిన సిబ్బంది శేషజీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. నగర పోలీస్ కమిషనరేట్లో పనిచేసి పదవీ విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోలు పలికే కార్యక్రమం కమిషనర్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. పదవీ విరమణ చేసిన వారిని ముందుగా దుశ్సాలువా, పూలమాలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంకిత భావంతో సేవలు అందించిన వారికి సమాజంలో ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని చెప్పారు. పదవీ విరమణ చేసిన వారిలో టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ ఎ.శ్రీనివాసరావు, గుణదల స్టేషన్ ఎస్‌ఐ అబ్దుల్ రఖీబ్, మూడో ట్రాఫిక్ ఎస్‌ఐ జె.రంగయ్య, సీఎస్‌బీలో ఏఎస్‌ఐ వై.ఎస్.మహంకాళిరావు, ఏఆర్‌లో హెడ్ కానిస్టేబుల్ ఎస్.శ్రీనివాసరావులు ఉన్నారు. పదవీ విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోలు చెప్పే కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ డి.ప్రసాదరావు, వెల్ఫేర్ ఆర్‌ఐ శ్రీనివాసరావు, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.సోమయ్య తదితరులు పాల్గొన్నారు.