Share News

వచ్చే రంజాన్‌కు ఈద్గా నిర్మాణం పూర్తి చేస్తాం

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:37 AM

వచ్చే రంజాన్‌కు ఈద్గా నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తెలిపారు.

వచ్చే రంజాన్‌కు ఈద్గా నిర్మాణం పూర్తి చేస్తాం
రంజాన్‌ ప్రార్థనల్లో గద్దె రామ్మోహన్‌, బోడె ప్రసాద్‌

వచ్చే రంజాన్‌కు ఈద్గా నిర్మాణం పూర్తి చేస్తాం

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

పటమట, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): వచ్చే రంజాన్‌కు ఈద్గా నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తెలిపారు. 12వ డివిజన్‌ జన్మభూమి వంతెన వద్ద సూర్యా స్కూల్‌ సమీపంలో రంజాన్‌ పర్వదినం సందర్భంగా సోమవారం ఈద్‌-ఉల్‌-ఫితర్‌ నమాజ్‌ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, బోడె ప్రసాద్‌లు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భగా గద్దె మాట్లాడుతూ ముస్లింలకు ఎంతో ప్రాముఖ్యమైన ఈద్గా నిర్మాణాలకు స్థలాలు ఎక్కడ అవసరమో గుర్తించి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. ఈ ప్రాంతంలో ఈద్గా నిర్మాణానికి స్థలం సేకరించి నిర్మాణానికి చర్మలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ మాట్లాడుతూ ముస్లిం, మైనార్టీలకు చెందిన గజం స్థలం కూడా కబ్జాకు గురి కాకుం డా చూస్తామన్నారు. లాయర్‌ మతిన్‌ మాట్లాడుతూ వక్ఫ్‌ సవరణ చట్టంపై ముస్లింలు చాలా ఆందోళనగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో నజీర్‌ అహమ్మద్‌ హుబ్రీ, పొట్లూరి సాయిబాబు, సాయిన బుజ్జి, ముస్లిం పెద్దలు రహ్మతుల్లా, అబ్దుల్‌ కాలీబ్‌, అబ్దుల్‌ కరీం, పటాన్‌ హైయత్‌ఖాన్‌, షేక్‌ అభినహీమ్‌, అబ్దుల్‌ వాహిద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 12:37 AM