Share News

తెలుగువారి తొలి పండుగ ఉగాది

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:54 AM

తెలుగువారు తొలి పండుగ ఉగాది అని తహసీల్దార్‌ భవన్నారాయణ అన్నారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ భవన్నారాయణ మాట్లాడుతూ తెలుగు ప్రజలు కుల, మతాలకు వ్యతిరేకంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిం చుకుంటారన్నారు.

 తెలుగువారి తొలి పండుగ ఉగాది
జంక్షన్‌ అభయాంజనేయస్వామి ఆలయానికి క్యూ కట్టిన భక్తులు

కంకిపాడు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : తెలుగువారు తొలి పండుగ ఉగాది అని తహసీల్దార్‌ భవన్నారాయణ అన్నారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ భవన్నారాయణ మాట్లాడుతూ తెలుగు ప్రజలు కుల, మతాలకు వ్యతిరేకంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిం చుకుంటారన్నారు. రుతువులు మారుతుంటాయి, వాటితో పాటే అవి మనకు పంచి ఇచ్చే అనుభూతులూ మారుతుం టాయి. ప్రకృతి ఎప్పుడూ నిత్యనూతనంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాసరావు, సర్వేయర్‌ భాస్కరరావు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్‌, ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం భక్తిశ్రద్ధలతో ఉగాది వేడకలు నిర్వహించారు. జంక్షన్‌లోని పలు ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. స్థానిక అభయాంజనేయస్వామి ఆలయంలో భక్తులు మధ్యాహ్నం వరకు క్యూ కట్టారు. ఆలయ ఈవో తారకేశ్వ రరావు పర్యవేక్షణలో ఆల యం వెనుక భాగంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయ అర్చకులు రామాచార్యులు పంచాంగ పఠనం చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజే శారు. స్థానిక నూజివీడు రోడ్డులోని శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారికి ఉగాది సందర్భంగా ఆలయ ట్రస్టీ కాకాని అరుణబాబు దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆలయంలో ఆర్చకులు చక్రావధానుల సీతా రామాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

ఉయ్యూరు : శ్రీవిశ్వావసు సంవత్సర ఉగాది వేడకులు ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పలుచోట్ల పంచాగ శ్రవణాలు ప్రత్యేక పూజలు చేశారు. వేణుగోపాలస్వామి, జగదంబా సమేత సోమేశ్వరస్వామి ఆలయంలో ఉగాది వేడుక నిర్వహించి వేద పండితులతో పంచాగ శ్రవణం గావించారు. ఉయ్యూరు వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏజీ అండ్‌ ఎస్‌ జీఎస్‌ జూని యర్‌ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో వేద పండితుడు పరాశరం రామకృష్ణాచార్యులు పంచాగ శ్రవణం చేశారు. ఏజీ అండ్‌ ఎస్‌ జీఎస్‌ కళాశాల వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇండోర్‌ స్టేడియం వద్ద ఉగాది వేడుకలో చింతలపాటి రామకృష్ణ పంచాంగ శ్రవణం చేసి విశ్వావసు సంవత్సరంలో మంచి చెడులను తెలియజేశారు. సోమేశ్వరస్వామి ఆలయం లో పుచ్చా సూర్యప్రకాశ శాసి్త్ర పఠనం చేశారు. బ్రాహ్మణ సంక్షేమ సంఘం బాపిరాజు ఆధ్వర్యంలో ఉగాది వేడక, పంచాంగ శ్రవణం గావించారు. ఎంకె ఇంగ్లీషు మీడియం స్కూల్‌ ఆవరణలో పూజలు చేసి ఉగాది పచ్చడి ప్రసాదంగా పంపిణీ చేశారు. గండిగుంట దత్తాశ్ర మంలో జరిగిన వేడుకల్లో సరసభారతి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గబ్బిట దుర్గాప్రసాద్‌ పాల్గొని పంచాంగ శ్రవణం చేశారు.

ప్రసాదంపాడు : శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కరించుకొని రామవరప్పాడు శ్రీవెంకమ్మ పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో ఆలయ ప్రధాన ఆర్చకులు ఇను గంటి లక్ష్మీనరసింహాశర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం ఆలయం వద్ద దాతల సహకారంతో ఉచిత మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. ఉగాది వేడుకల్లో భారీగా భక్తులు పాల్గొని పంచాంగ శ్రావణాన్ని ఆలకించారు. అమ్మ వారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఈవో ప్రియాంక, టీడీపీ నాయకులు కొల్లా ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 12:55 AM