మైనార్టీల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:20 AM
బంటుమిల్లి రోడ్డులోని మియాఖాన్ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో గిడ్డంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్ రావి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

గుడివాడ, మార్చి 27(ఆంధ్రజ్యోతి): మైనార్టీల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గిడ్డంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్ రావి వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం బంటుమిల్లి రోడ్డులోని మియాఖాన్ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలోని మైనార్టీలకు అండగా ఉంటానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మైనార్టీ నాయకులు జానీ షరీఫ్, షేక్ ఇబ్రహీం, అబ్దుల్ మున్వర్, రఫీ, షేక్ సర్కార్, సయ్యద్ గఫార్, మసీదు కమిటీ అధ్యక్షుడు వలీ, టీడీపీ నాయకులు రాంబాబు, సత్యనారాయణ, లింగం ప్రసాద్, చేకూరు జగన్మోహనరావు, రమేష్, శివ పాల్గొన్నారు.