ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వర్చువల్ ముగ్గుల పోటీలో హర్షితకు రెండో స్థానం
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:45 AM
సంకాంత్రికి ఆంధ్రప్రదేశ్ ఆమెరికన్ అసోసియేషన్ నిర్వహించిన వర్చువల్ ముగ్గుల పోటీల్లో పట్టణానికి చెందిన మామిడి హర్షిత(21)కు రెండో స్థానం లభించింది.

రూ.15,00,116 బహుమతి
జగ్గయ్యపేట, మార్చి 30(ఆంధ్రజ్యోతి): సంకాంత్రికి ఆంధ్రప్రదేశ్ ఆమెరికన్ అసోసియేషన్ నిర్వహించిన వర్చువల్ ముగ్గుల పోటీల్లో పట్టణానికి చెందిన మామిడి హర్షిత(21)కు రెండో స్థానం లభించింది. రూ.15,00,116 నగదు బహుమతి అందుకోనుంది. ఉగాది సందర్భంగా అసోసియేషన్ విజేతలను ప్రకటించింది. మామిడి హర్షిత వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని చిత్రరూపంలో గీసింది. 10 రోజుల పాటు రోజుకు 10 గంటలు శ్రమించి కల్యాణాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రించింది. రంగులకు రూ.10 వేల వరకు వెచ్చించింది. తనకు బహుమతి వస్తుందని ఊహించలేదని, సంతోషంగా ఉందని హర్షిత తెలిపింది. హర్షితకు ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, మాజీ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు, మునిసిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర శుభాకాంక్షలు తెలిపారు.