తెలంగాణకు ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్ల స్వాధీనం
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:45 AM
తెలంగాణాకు ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చిల్లకల్లు ఎస్సై టి.సూర్యశ్రీనివాస్ తెలిపారు.

జగ్గయ్యపేట రూరల్, మార్చి 24(ఆంధ్రజ్యోతి): తెలంగాణాకు ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చిల్లకల్లు ఎస్సై టి.సూర్యశ్రీనివాస్ తెలిపారు. చందర్లపాడు మండలం కాసరబాద క్వారీ నుంచి జగ్గయ్యపేట మండ లం రామచంద్రునిపేటకు ఇసుక తరలిస్తున్నట్లు వేబిల్లు ఉం దని, వాహనాలు వేకు వజామునే తెలంగాణ వైపు వెళ్తున్నాయనే సమాచారంతో తనిఖీలు చేశామన్నారు. డ్రైవర్లు నక్కా లెనిన్, మణిమాల నాగేశ్వరరావులపై కేసు నమో దు చేశామన్నారు.