Share News

సైకిల్‌ దెబ్బకు సైకో పరార్‌

ABN , Publish Date - Mar 28 , 2025 | 01:16 AM

సైకిల్‌ దెబ్బకు సైకో బెం గళూరు పరారయ్యాడని మాదిగ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఉండవల్లి శ్రీదేవి అన్నారు.

సైకిల్‌ దెబ్బకు సైకో పరార్‌
సర్పంచులకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్‌, వర్ల కుమార్‌రాజా

మాదిగ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఉండవల్లి శ్రీదేవి

ముగ్గురు సర్పంచ్‌లు టీడీపీలో చేరిక

కంకిపాడు, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : సైకిల్‌ దెబ్బకు సైకో బెం గళూరు పరారయ్యాడని మాదిగ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. మండలంలోని ఉప్పులూరు సర్పంచ్‌ లాం సోనియా, తెన్నేరు సర్పంచ్‌ జుజ్జవరపు ఎలీషా, మారేడుమాక సర్పంచ్‌ చోడ వరపు ఆదర్శకుమార్‌లకు ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్‌, వర్ల కుమార్‌ రాజాలతో కలిసి ఆమె టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దళితులను మాజీ సీఎం జగన్‌ అనేక అవమానాలకు గురి చేశారన్నారు. రాష్ట్ర ప్రజలతో మూడు ముక్కలాట ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన ఈ 9 నెలల్లో తొమ్మిది రోజులు కూడా ఖాళీగా కుర్చోలేదన్నారు. ఎమ్మెల్యే బోడె మాట్లాడుతూ రానున్న నాలుగేళ్లలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఉప్పలూరు గ్రామ అభివృద్ధికి రూ. కోటి మంజూరు చేస్తానన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు సుదిమళ్ల రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవినేని రాజా, టీడీపీ నాయకులు రాజా, రాధా కృష్ణమూర్తి,సుబ్రహ్మణ్యం, సుధాకర్‌, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 01:16 AM