విద్యార్థినికి వేధింపులు..అధ్యాపకుడి సస్పెన్షన్
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:17 AM
అంగలూరు డైట్ కళాశాల విద్యార్థినికి అసభ్యకర ఫోన్ సందేశాలు పంపుతూ వేధిస్తున్న అధ్యాపకుడిని డీఈవో సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారని ప్రిన్సిపాల్ డాక్టర్ సలీమ్ బాషా తెలిపారు.

గుడ్లవల్లేరు, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): అంగలూరు డైట్ కళాశాల విద్యార్థినికి అసభ్యకర ఫోన్ సందేశాలు పంపుతూ వేధిస్తున్న అధ్యాపకుడిని డీఈవో సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారని ప్రిన్సిపాల్ డాక్టర్ సలీమ్ బాషా తెలిపారు. ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం..డోకిపర్రు హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూఅంగలూరు డైట్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న కె.హరికిరణ్ కళాశాలలో చదువుతున్న ఒక విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఫోన్ మెసేజ్‌లు పంపుతున్నారని విద్యార్థిని ఈనెల 22వతేదీన ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును డీఈ వో దృష్టికి ప్రిన్సిపాల్ తీసుకెళ్లారు. దీంతో హరికిరణ్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు బుధవారం ఆదేశాలు వచ్చాయని, వాటిని హరికిరణ్‌కు పంపామని ప్రిన్సిపాల్ తెలిపారు. తదుపరి విచారణ చేసి చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు.