స్వర్ణభారత్ ట్రస్ట్‌లో 30న ఉగాది సంబరాలు
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:11 AM
ఆత్కూరు స్వర్ణభారత్‌ట్రస్ట్ (విజయవాడ చాప్టర్)లో నిర్వహించే శ్రీవిశ్వావసు నామసంవత్సర ఉగాది సంబరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పాల్గొంటారు.

హాజరు కానున్న సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఉంగుటూరు, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : ఆత్కూరు స్వర్ణభారత్‌ట్రస్ట్ (విజయవాడ చాప్టర్)లో ఈనెల 30వ తేదీ సాయంత్రం 3 గంటలకు నిర్వహించే శ్రీవిశ్వావసు నామసంవత్సర ఉగాది సంబరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పాల్గొంటారని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఇమ్మణ్ణి దీపావెంకట్ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు రానున్న దృష్ట్యా ఏర్పాట్లను గుడివాడ ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, డీఎస్పీ చలసాని శ్రీనివాసరావుతో కలిసి జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గురువారం పరిశీలించారు. హనుమాన్‌జంక్షన్ సీఐ కేవీవీఎన్ సత్యనారాయణ, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.