Share News

Vamsi Bail Petition: వరుస ఎదురుదెబ్బలతో వంశీ ఉక్కిరిబిక్కిరి

ABN , Publish Date - Mar 28 , 2025 | 03:56 PM

Vamsi Bail Petition: వల్లభనేని వంశీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ పిటిషన్‌ దాఖలు చేయగా.. విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Vamsi Bail Petition: వరుస ఎదురుదెబ్బలతో వంశీ ఉక్కిరిబిక్కిరి
Vamsi Bail Petition

విజయవాడ, మార్చి 28: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (Former MLA Vallabhaneni Vamsi) మరోసారి భారీ షాక్ తగిలింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్ కిడ్నాప్‌ కేసులో వంశీకి చుక్కెదురైంది. ఈ కేసులో వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రాసుక్యూషన్ తరపు వాదనలను తాము పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది. అలాగే సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఐఓకు, ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ న్యాయస్థానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంగా కోర్టును ధిక్కరించేలా వ్యవహరించారని ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం వెల్లడించింది.


కాగా.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వంశీ ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. మూడు విడుతలుగా ఇరువర్గాల వాదనలు విన్న న్యాయాధికారి బెయిల్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలను ఆర్డర్‌లో పొందుపర్చారు న్యాయాధికారి. వంశీ బెయిల్‌ పిటిషన్‌కు సంబంధించి వాదనల సమయంలో విచారణాధికారి, ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించిన సమయంలో కొన్ని అభ్యంతరాలను లేవత్తుతూ కోర్టు సమయాన్ని వృధా చేశారని న్యాయాధికారి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కొన్ని అనవసర వ్యాఖ్యలు చేసినట్లు అభిప్రాయపడుతూ ఐఓ, ప్రాసిక్యూషన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఉత్తర్వుల్లో పొందుపర్చారు.

CM Chandrababu Statement: భవిష్యత్ అంతా భారతీయులదే


ఇదిలా ఉండగా... టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్‌ను నిన్న (గురువారం) సీఐడీ కోర్టు కూడా డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. వంశీతో పాటు మరో నలుగురు నిందితులకు కూడా బెయిల్ ఇచ్చేది లేదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఈరోజు సత్యవర్థన్ కేసులో కూడా ఎస్సీ ఎస్టీ కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో వంశీ మరికొన్ని రోజులు జైలులోని ఉండే పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా టీడీసీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ రిమాండ్ ముగియడంతో నేటి ఉదయం జిల్లా జైలు నుంచి నేరుగా కోర్టుకు తీసుకెళ్లారు గన్నవరం పోలీసులు. వంశీతో పాటు లక్ష్మీపతిని కూడా కోర్టు హాజరుపర్చారు. ఈ కేసులో రిమాండ్‌ను ఏప్రిల్ 9 వరకు పొడిగిస్తూ సీఐడీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు కోర్టుల్లోనూ బెయిల్ పిటిషన్లు డిస్మిస్ కావడంతో వంశీ ఇక పైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది.


ఇవి కూడా చదవండి...

Youth Firing Gun: అర్ధరాత్రి కారులో వెళ్తూ ఆ యువకులు చేసిన పని తెలిస్తే

Young Man Killed: పుట్టినరోజు నాడే కిరాతకం.. యువకుడి దారుణ హత్య

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 28 , 2025 | 04:54 PM