Share News

యువకుడి అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:50 PM

కోకిలంపాడు రోడ్డు సమీపంలోని ఒక ఇంట్లో మడిపల్లి వెంకటే్‌్‌ష(22)అనుమానాస్పదంగా మృతిచెందిఉన్నట్టు ఎస్సై కేవీజీవీ సత్యనారాయణ సోమవారం తెలిపారు.

యువకుడి అనుమానాస్పద మృతి

తిరువూరు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): కోకిలంపాడు రోడ్డు సమీపంలోని ఒక ఇంట్లో మడిపల్లి వెంకటే్‌్‌ష(22)అనుమానాస్పదంగా మృతిచెందిఉన్నట్టు ఎస్సై కేవీజీవీ సత్యనారాయణ సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మంజిల్లా కల్లూరు మండలం మర్లపాలెం గ్రామానికి చెందిన వెంకటేష్‌ పట్టణంలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో పనిచేస్తూ కోకిలంపాడు రోడ్డులో ఒక గదిలో అద్దెకు ఉంటాడని, ఆదివారం రాత్రి గదిలో మృతిచెంది ఉన్నాడని ఎస్సై తెలిపారు. వెంకటేష్‌ తల్లి కృపమ్మ ఫిర్యాదుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - Mar 31 , 2025 | 11:50 PM