మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:31 AM
కుమారుడితో కలిసి బైక్‌పై వెళ్తు న్న మహిళ మెడలోనుంచి మూడు కాసుల బంగారు గొలుసు (నాంతాడు)ను లాక్కుని బైక్‌పై పరారైన సంఘటన ఆదివారం రాత్రి ఆత్కూరు పోలీస్‌స్టేషన పరిథిలోని పెదఅవుటపల్లిలో చోటుచేసుకుంది.

ఉంగుటూరు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : కుమారుడితో కలిసి బైక్‌పై వెళ్తు న్న మహిళ మెడలోనుంచి మూడు కాసుల బంగారు గొలుసు (నాంతాడు)ను లాక్కుని బైక్‌పై పరారైన సంఘటన ఆదివారం రాత్రి ఆత్కూరు పోలీస్‌స్టేషన పరిథిలోని పెదఅవుటపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై చావా సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమానజంక్షనలోని హనుమాననగర్‌కు చెందిన పొనుగుమాటి భానుమతి (50) తన కుమారుడు నితీష్(22)తో కలిసి బైక్‌పై ఆదివారం సాయంత్రం చినఅవుటపల్లిలోని పిన్నమనేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించేందుకు వెళ్లారు. తిరిగి రాత్రి 7గంటల సమయంలో ఇంటికి బయలుదేరారు. పెదఅవుటపల్లి ఫ్లైఓవర్‌బ్రిడ్జి కిందనుంచి హనుమానజంక్షనవైపు వెళ్లే సర్వీస్‌రోడ్డులోకి బైక్ మలుపుతిరుగుతున్న క్రమంలో వెనుకగా పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు నితీష్ బైక్‌పై వెనుక కూర్చున్న భానుమతి మెడలోనుంచి గొలుసును లాక్కుని పరారయ్యారు. బాధితురాలు ఆత్కూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై దర్యాప్తు చేపట్టారు.