మురిపించిన మునగ
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:40 AM
సాధారణ పంటల సాగుతో నష్టపోయిన ఓ రైతు మునగ సాగు చేశారు. అయితే లాభాల పంట పండించింది. వివరాలు.. మండలంలోని తెర్నేకల్ గ్రామానికి చెందిన రైతు ఎర్రబాటి నాగేష్ ఎకరా భూమిలో ఉల్లి సాగుచేసి, అం తర పంటగా మునగ మొక్కలు నాటాడు.

ఎకరాకు రూ.లక్ష ఆదాయం
దేవనకొండ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): సాధారణ పంటల సాగుతో నష్టపోయిన ఓ రైతు మునగ సాగు చేశారు. అయితే లాభాల పంట పండించింది. వివరాలు.. మండలంలోని తెర్నేకల్ గ్రామానికి చెందిన రైతు ఎర్రబాటి నాగేష్ ఎకరా భూమిలో ఉల్లి సాగుచేసి, అం తర పంటగా మునగ మొక్కలు నాటాడు. ఉల్లి కోత ముగిశాక మునగ కోత మొదలైంది. రూ. 20వేలు పెట్టుబడి పెట్టగా రూ.లక్ష ఆదా యం వచ్చిన్న ట్లు రైతు తెలిపారు. మార్కె ట్లో మునగ కాడల ధర కిలో రూ.50లు పలుకుతుందని, స్థాని కంగా అమ్మగా, మిగిలిన సరుకును ఆదోని మార్కెట్‌కు పంపతున్నట్లు తెలిపారు. మునగ కోతకు కూలీల ఖర్చు కుడా తక్కువేనని, కుటుంబ సభ్యులతోనే కోసినట్లు తెలిపారు.